నిమ్స్‌లో సహజ వైద్య చికిత్సలు
మెరుగైన జీవనశైలికి ప్రకృతి వైద్యం
అలోపతి చికిత్సల చెంతనే
నిమ్స్‌లో ఇంటిగ్రేటెడ్ వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటు
ప్రకృతి వైద్యనిపుణురాలు డా.నాగలక్ష్మి
లక్డీకాపూల్: జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పులతో నగర ప్రజలు వివిధ రకాల నొప్పులతో సతమతమవుతున్నారు. అవే పెద్ద సమస్యలుగా భావించి చాలా మంది కార్పొరేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. తొలనొప్పి, కండరాల, మోకాళ్ల నొప్పులు, మానసిక ఒత్తిడి, మిటమిన్స్ లోపం, అధిక బరువు వంటి సాధారణ సమస్యలను కూడా చాలా మంది పెద్ద జబ్బులుగా భావిస్తున్నారు. దీంతో రిఫరల్ అస్పత్రి అయిన నిమ్స్ సైతం రోగులతో కిటకిటలాడుతున్న పరిస్థితి.
ఈ నేపథ్యంలో తక్కువ ఖర్చుతోనే సహజ సిద్ధమైన వైద్య చికిత్సలతో నొప్పులకు ఉపశమనం కలి్పంచాలన్న కృతనిశ్చయంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయూష్ శాఖ నిమ్స్‌లో ఇంటిగ్రేటెడ్ వెల్‌నెస్ సెంటర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అలోపతి వైద్యాన్ని అంతర్జాతీయ స్థాయిలో బలోపేతం చేస్తూనే.. దేశీయ వైద్యానికి సైతం పెద్దపీట వేస్తున్నారు. సంప్రదాయ వైద్యమైన ఆయుష్ సేవలకు ప్రాచుర్యం కలి్పంచేందుకు దృష్టిని కేంద్రీరించింది.
లోపించిన శారీరకశ్రమ..
మనిషి కూర్చునే భంగిమని బట్టి కూడా ఈ నొప్పులు చోటుచేకుంటాయి. వాస్తవానికి ఇటీవల కాలంలో శారీరశ్రమ లోపించింది. చెప్పాలంటే.. శరీరాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడం లేదు. విటమిన్ల లోపం వల్ల కొంత మంది ఇబ్బంది పడుతుంటే పోషకాహార లోపం వల్ల మరికొంత మంది అనార్యోగం పాలవుతున్నారు. ఆస్పత్రికి వచి్చన రోగులకు ప్రకృతి వైద్యం పట్ల అవాగాన కల్పిస్తూ.. భవిష్యత్తులో వారు ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధులకు గురికాకుండా చూసేందుకే ఈ ఇంటిగ్రేటెడ్ వెల్‌నెస్ సెంటర్ కృషి చేస్తుంది.
– డా.నాగలక్షి్మ, ప్రకృతి వైద్యనిపుణురాలు
అలోపతికి సమాంతరంగా...
అలోపతి వైద్యానికి సమాంతరంగా ఆయుష్ సేవలు కూడా ప్రజలకు చేరువ కానున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులు, సీజనల్, ప్రసూతి సమస్యలు, కీళ్ల నొప్పులు తదితర అన్ని రకాల సమస్యలకూ ప్రకృతి వైద్య చికిత్స అందుబాటులో ఉండడమే కాకుండా వ్యాధి మూలాలపై పనిచేసి, పునరావృతం కాకుండా చేయడమే సహజ వైద్య చికిత్సల లక్ష్యమని నిపుణులు పేర్కొంటున్నారు. నరగంలో పెరుగుతున్న కాలుష్యం, ఒత్తిడి స్థాయిలు, ఆందోళన మొదలైన పర్యావరణ మార్పులకు దారితీసింది. అటువంటి సమస్యలను ఎదుర్కోవటానికి ఏకైక మార్గం ప్రకృతి వైద్య చికిత్సలు. సాధారణ నొప్పులతో పాటు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో బాధపడే వారికి తక్కువ ఖర్చుకే సహజమైన పద్ధతిలో మెరుగైన సేవలు అందిస్తున్నారు. అలోపతి వైద్య పద్దతిలో లొంగని వ్యాధులకు సైతం ఆయుష్ ఉపశమనం కలి్పస్తుంది. దీంతో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సైతం ఈ సహజ వైద్య చికిత్సల పట్ల ఆసక్తి చూపుతున్నారు.
నామమాత్రపు రుసుము..
పంచకర్మ చికిత్సల్లో భాగంగా స్నేహకర్మ, నదిస్వేదం, పిండిస్వేదం, కతివస్తి, జనువస్తి, నాశ్యకర్మ, శిరోధార, డెటాక్స్ థెరపీ, బరువు నియంత్రణ, మానసిక ఒత్తిడి నిర్మూలన, బాడీ మసాజ్, మైగ్రేన్ వంటి సేవలతో పాటు ప్రకృతి వైద్య సేవల్లో భాగంగా జనరల్ మసాజ్, స్టీమ్‌బాత్, డైట్ కౌన్సిలింగ్, కోల్డ్ బ్లాంకెట్ ప్యాక్, తల, కండరాలు, నడుం, భుజాలు, మోకాళ్ల నొప్పులకు చికిత్సలు అందిస్తుంది. ఆక్యుపంక్చర్, యోగ వంటి సేవలను కూడా అందుబాటులో ఉంచింది. రోగులు ఎదుర్కొంటున్న సమస్యను బట్టి చికిత్సను అందిస్తుంది. ఎంపిక చేసుకున్న చికిత్స, సేవలు, సిట్టింగ్ ఆధారంగా నామమాత్రపు రుసుమును వసూలు చేస్తున్నారు. చికిత్స పొందాలంటే ముందుగానే స్లాట్ బుక్ చేసుకోవాలి. వాస్తవానికి సహజ వైద్య చికిత్సలను ప్రణాళికబద్ధంగా అనుసరించాల్సిందే. ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ఒక స్లాట్‌గా, మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదున్నర గంటల వరకూ మరో స్లాట్‌గా నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment