లేకపోతే ఈపాటికే జైల్లో ఉండేవారు: కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్ : h సీఎం వసూళ్ల చిట్టా అంతా హైకమాండ్ పెద్దల దగ్గర ఉందని, వారి మా ట వినకుంటే ఈపాటికే చంచల్‌గూడ జైల్లో ఊచలు లెక్కపెట్టేవారని వ్యాఖ్యానించారు. బుధవారం అసెంబ్లీ లాబీల్లోని చంద్రబాబు ఛాంబర్ ఎదుట కోమటిరెడ్డి విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతున్న సమయంలో మంత్రులు కాసు వెంకట కృష్ణారెడ్డి, వట్టి వసంతకుమార్, టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు, టీడీపీ ఎంపీ సీఎం రమేష్ అక్కడ ఆగారు.
ఈ సందర్భంగా వారి మధ్య ఆసక్తికరంగా చర్చ జరిగింది. తొలుత కోమటిరెడ్డి మాట్లాడుతూ, విభజన విషయంలో పూర్తిగా సహకారం అందిస్తానని ఢిల్లీలో హైకమాండ్ పెద్దలకు హామీ ఇచ్చిన కిరణ్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్ వచ్చి సమైక్యముద్ర వేయించుకునే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. నిజంగా ఆయన విభజనకు సహకరించకపోతే, ప్రక్రి య ఇంతవరకు వచ్చేది కాదన్నారు. తనకు ఆత్మాభిమానం ఉన్నందువల్లే మంత్రి పదవికి రాజీనామా చేశానన్నారు. విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చిన చంద్రబాబు సమన్యాయం అని ఒకసారి, విభజన అడ్డగోలుగా ఎలా చేస్తారంటూ మరోసారి చెప్తున్న మాటలతో తెలంగాణలో పార్టీకి నష్టం జరుగుతోందన్నారు.
ఆ సమయంలో కాసు కృష్ణారెడ్డి జోక్యం చేసుకుని.. కృష్ణా, గుంటూరు జిల్లాలను కూడా చేర్చుకుంటే తెలంగాణ రాష్ర్టం ఇవ్వాల్సిందిగా రాసిస్తామని, 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవి కూడా ఆ ప్రాంతం వారికే ఇచ్చేటట్లు హామీ పత్రం రాసిస్తామని అన్నారు. వెంటనే కోమటిరెడ్డి ‘‘పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి నాకు 15 సంవత్సరాలుగా తెలుసు. వారు మాట్లాడే తెలుగు ఒక్క ముక్క కూడా అర్థం కాదు. మీ భాషకు, మా భాషకు చాలా వ్యత్యాసం ఉంటుంది, మీరు సంక్రాంతి పండుగను ఆడంబరంగా చేసుకుంటే మేం దసరా పండుగను అట్లా చేసుకుంటాం. మీకు మాకు పొత్తే కుదరదు’’ అన్నారు. రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ కిరణ్‌కుమార్‌రెడ్డి మినహా ఎవరు సీఎంగా ఉన్నా రాష్ట్రం సమైక్యంగా ఉండేదన్నారు.
సీఎం విభజనకు సహకరిస్తున్నారు
Published Thu, Dec 19 2013 1:26 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement