ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ అపాయింట్‌మెంట్ కోరారు.
ఢిల్లీ: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ అపాయింట్‌మెంట్ కోరారు. ఈరోజు సీఎం సోనియాను కలిసే అవకాశం ఉంది. అధిష్టానం పిలుపు మేరకు ఇక్కడకు వచ్చిన సీఎం పార్టీ ముఖ్యులను కలుస్తున్నారు. నిన్న పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్ను, ఆంటోనీ కమిటీని కలిశారు. రాష్ట్రంలో పరిస్థితులను వారికి వివరించారు. విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో సాగుతున్న సమైక్య ఉద్యమ తీవ్రతను కూడా వారికి వివరించారు.
ఈ రోజు సోనియాను కూడా కలిసి పరిస్థితులను వివరిస్తారు.