అధికారిక కమిటీ ఏర్పాటుతో సహా విభజన అంశంపై నోట్ రూపకల్పనకు కేంద్రం సిద్ధమవుతున్నట్లు వార్తలొస్తున్న నేపథ్యంలో అందుబాటులో ఉండాల్సిందిగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి ఢిల్లీ పెద్దల నుంచి సమాచారం అందినట్లు తెలిసింది.
సాక్షి, హైదరాబాద్: అధికారిక కమి టీ ఏర్పాటుతో సహా విభజన అం శంపై నోట్ రూపకల్పనకు కేంద్రం సిద్ధమవుతున్నట్లు వార్తలొస్తున్న నేపథ్యంలో అందుబాటులో ఉండాల్సిం దిగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి ఢిల్లీ పెద్దల నుంచి సమాచారం అందినట్లు తెలిసింది. ఒకటి రెండు రోజుల్లో సీఎం ఢిల్లీ వెళ్లే అవకాశాలున్నాయని చెబుతున్నారు. సోమవారం మంత్రులు గంటా శ్రీనివాసరావు, ఏరాసు ప్రతాప్‌రెడ్డిలు ముఖ్యమంత్రిని కలిసి తమ రాజీనామాలను ఆమోదించాలని కోరగా, తొందరపడొద్దని సీఎం సూచించారు. మంగళవారం సాయంత్రం లేదా బుధవారం ఉదయం తాను ఢిల్లీ వెళ్తున్నందున ఒక స్పష్టత వస్తుందని, ఆపై నిర్ణయం తీసుకుందామని వివరించారు. ఇలావుండగా, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఇప్పటికే ఢిల్లీలో మకాం వేశారు. మరి కొందరు మంత్రులు కూడా మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు.