కాంగ్రెస్ ను విమర్శిస్తున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఏ ప్రయోజనాన్ని ఆశించి తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చారో చెప్పాలని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు.
ఢిల్లీ: కాంగ్రెస్ ను విమర్శిస్తున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఏ ప్రయోజనాన్ని ఆశించి తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చారో చెప్పాలని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. సీమాంధ్ర ఉద్యమ నేపధ్యంలో నేతలు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతూ రాష్ట్రానికి సమన్యాయం చేయాలని అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తున్న సంగతి తెలిసిందే.
సీమాంధ్ర ప్రజలు రోడ్లమీదకు వచ్చి ఉద్యమిస్తున్నారని.... మంత్రులు కూడా తమతో కలవాలని శుక్రవారం ఉద్యోగులు కోరగా.... పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కొద్దిగా అసహనం ప్రదర్శించారు. మీరు చేస్తున్నదే ఉద్యమమా అని ప్రశ్నించారు. తాము కూడా సమైక్య రాష్ట్రం కోసం కృషి చేస్తున్నామని బొత్స తెలిపారు.