ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి బుధవారం పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో సమావేశం అయ్యారు. అధిష్టానం పిలుపు మేరకు హస్తినకు చేరుకున్న ముఖ్యమంత్రి పార్టీ ముఖ్యులను కలుస్తున్నారు. రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్, ఆంటోనీ కమిటీని కిరణ్ నిన్న కలిశారు. రాష్ట్రంలోని పరిస్థితులను వారికి వివరించారు. విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో సాగుతున్న సమైక్య ఉద్యమ తీవ్రతను కూడా వారికి వివరించారు. రాష్ట్ర విభజన చేపడితే ఎదురయ్యే సమస్యలపై కిరణ్‌కుమార్ రెడ్డి ఎనిమిది పేజీల నివేదిక సమర్పించారు. అయితే, ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఆంటోని కమిటీ స్పష్టం చేసినట్టు తెలిసింది. అందుకే ముఖ్యమంత్రి బుధవారం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కలిసి మరోసారి తమ వాదన వినిపిస్తున్నారు.
Published Wed, Aug 21 2013 1:35 PM | Last Updated on Wed, Mar 20 2024 3:51 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement