ఖైరతాబాద్, న్యూస్‌లైన్:
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తప్పదని తెలిసే సీఎం కిరణ్ తెలంగాణ జిల్లాల్లో అభివృద్దిని నీరుగారుస్తున్నారని ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. ఆదివారం తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 2014 డైరీ ఆవిష్కరణకి ముఖ్యఅతిధిగా విచ్చేసి డైరీ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ 2010 నుంచి తెలంగాణ జిల్లాల్లో అభివృద్ధి పథకాలు అమలుకు నోచుకోలేదని గుర్తుచేశారు. సీమాధ్రులకు 7 గంటల కరెంటు ఇస్తే, తెలంగాణ జిల్లాలకు కేవలం 5 గంటలు మాత్రమే ఇస్తున్నారని తెలిపారు.
కిరణ్, చంద్రబాబు కలిసి ఎన్ని కుట్రలు పన్నినా రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోలేరన్నారు. అంతకుముందు ధూంధాం పాటలతో కళాకారులు ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సమ్మయ్య, హౌసింగ్ సీజీఎం ఆర్.జగదీష్‌బాబు, జీఎం. రమేష్, అసోసియేషన్ అధ్యక్షుడు ఎ.మహేందర్, రవీందర్‌రెడ్డి, ఎస్.మోహన్, వెంకట్‌రాం రెడ్డి, టి.లింగయ్య గౌడ్, ఆర్.సురేష్ తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధిని నీరుగారుస్తున్న కిరణ్: హరీష్‌రావు
Published Mon, Jan 20 2014 3:57 AM | Last Updated on Sun, Apr 7 2019 3:34 PM
Advertisement
Advertisement