హైదరాబాద్ : శ్రీధర్ బాబు శాఖ మార్పు దుమారం ఇంకా కొనసాగుతూనే ఉంది. సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత మంత్రులు అవకాశం దొరికినప్పుడల్లా తమ నోటికి పని చెబుతున్నారు. సిగ్గు ఉంటే తెలంగాణ మంత్రులు రాజీనామా చేయాలని మంత్రి టీజీ వెంకటేష్ వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంలో మంత్రి శ్రీధర్ బాబును బలిపశువును చేశారని ఆయన అన్నారు. కాగా టీజీ వెంకటేష్ వ్యాఖ్యలకు మంత్రి దానం నాగేందర్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ మంత్రులు రాజీనామా చేస్తే సీమాంధ్ర మంత్రులు కిరాణా దుకాణం పెట్టుకోవాలన్నారు.