టీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశంపై తెలంగాణ మంత్రుల్లో టెన్షన్ పట్టుకుంది.
హైదరాబాద్: టీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశంపై తెలంగాణ మంత్రుల్లో టెన్షన్ పట్టుకుంది. కేబినెట్లో మార్పులకు సంబంధించి గురువారం జరిగే ఈ సమావేశంలో స్పష్టం వచ్చే అవకాశముంది. కేబినెట్లో మార్పులు తప్పవని సీనియర్ మంత్రులు భావిస్తున్నట్టు తెలుస్తోంది.
రేపు ఉదయం తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరగనుంది. పార్టీకి, ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. నామినేటెడ్ పోస్టులను, పార్టీ పదవులను, మార్కెట్ కమిటీలను ఖరారు చేసే అవకాశముంది.