cabinet changes
-
బ్రిటన్ మంత్రివర్గంలో కుదుపు
లండన్: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ సోమవారం తన మంత్రివర్గంలో ఆకస్మిక మార్పుచేర్పులు చేశారు. కొంతకాలంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న భారత మూలాలున్న హోం మంత్రి సుయెల్లా బ్రేవర్మన్ను మంత్రివర్గం నుంచి తొలగిస్తూ ముందుగా నిర్ణయం తీసుకున్నారు. ఆ వెంటనే మాజీ ప్రధాని డేవిడ్ కామెరాన్‌ను విదేశాంగ మంత్రిగా నియమిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇప్పటిదాకా విదేశాంగ మంత్రిగా ఉన్న జేమ్స్ క్లెవర్లీని బ్రేవర్మన్ స్థానంలో హోం మంత్రిగా నియమించారు. ప్రధాని సిఫార్సుల మేరకు వారిద్దరి నియామకాలకు రాజు చార్లెస్ ఆమోదముద్ర వేసినట్టు డౌనింగ్ స్ట్రీట్ ఒక ప్రకటనలో పేర్కొంది. మరోవైపు హౌజింగ్ మంత్రి రేచల్ మెక్‌లీన్‌ను కూడా సునాక్ పదవి నుంచి తప్పించారు.ఈ నేపథ్యంలో మరో ఆరుగురు జూనియర్ మంత్రులు కూడా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు! థెరెసా కోఫీ, నిక్ గిబ్, నీల్ ఓబ్రియాన్, విల్ క్విన్స్, జెస్సీ నార్మన్ ఈ జాబితాలో ఉన్నారు. కామెరాన్... అనూహ్య ఎంపిక 57 ఏళ్ల కామెరాన్‌కు రిషి విదేశాంగ బాధ్యతలు అప్పగించడం అనూహ్యమేనని చెప్పాలి. ఒక మాజీ ప్రధానిని ఇలా మంత్రివర్గంలోకి తీసుకోవడం బ్రిటన్‌లో చాలా అరుదు. పైగా ప్రధానిగా రాజీనామా చేశాక కామెరాన్ ఏడేళ్లుగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అంతేగాక ప్రస్తుతం ఎంపీ కూడా కాదు. ఈ నేపథ్యంలో ఆయన్ను ఎగువ సభ హౌస్ ఆఫ్ లార్డ్స్‌లోకి తీసుకున్నారు. బ్రిటన్‌లో ఇలా విదేశాంగ మంత్రి ఎగువ సభ్య సభ్యుడిగా ఉండటం 40 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. 1980ల్లో లార్డ్స్ సభ్యుడైన పీటర్ కారింగ్టన్ మార్గరెట్ థాచర్ మంత్రివర్గంలో విదేశాంగ మంత్రిగా పని చేశారు. కష్టకాలంలో ప్రధానిగా రిషి పనితీరు గొప్పగా ఉందంటూ కామెరాన్ ఈ సందర్భంగా మెచ్చుకున్నారు. ‘‘కొన్ని వ్యక్తిగత నిర్ణయాల విషయంలో రిషితో నేను గతంలో విభేదించ ఉండొచ్చు. కానీ ఆయన అత్యంత సమర్థుడైన ప్రధాని’’ అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దేశ భద్రత, ప్రగతి తదితర కీలకాంశాల్లో ఆశించిన ఫలితాల సాధనలో రిషికి శక్తివంచన లేకుండా తోడ్పడతా. ఏడేళ్లుగా క్రియాశీల రాజకీయాలకు కాస్త దూరంగా ఉన్నా కీలక సవాళ్లను దీటుగా ఎదుర్కోవడంలో రిషికి దన్నుగా నిలిచేందుకు నా రాజకీయ అనుభవమంతటినీ రంగరిస్తా’’ అని చెప్పారు. 2010 నుంచి 2016 దాకా ఆరేళ్లపాటు ఆయన బ్రిటన్ ప్రధానిగా ఉన్నారు. బ్రిటన్ యూరోపియన్ యూనియన్ (ఈయూ)లో కొనసాగాలని గట్టిగా వాదించారు. ఈ విషయమై 2016లో మూడు రెఫరెండాలు తెచ్చారు. కానీ ప్రజలు ఈయూ నుంచి వైదొలగేందుకు (బ్రెగ్జిట్)కే ఓటేయడంతో రాజీనామా చేశారు. సునాక్ కూడా బ్రెగ్జిట్‌కే మద్దతిచ్చారు. పైగా ఆ సమయంలో కామెరాన్ మంత్రివర్గంలో సునాక్ జూనియర్ మంత్రి కూడా కావడం విశేషం! విదేశాంగ మంత్రి జై శంకర్ ఐదు రోజుల పర్యటన నిమిత్తం ప్రస్తుతం ఇంగ్లండ్‌లో ఉన్నారు. ఆదివారం సునాక్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు కూడా. పర్యటనలో భాగంగా క్లెవర్లీతో జై శంకర్ సమావేశాలు జరపాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా విదేశాంగ బాధ్యతలు స్వీకరించిన కామెరాన్‌తో జై శంకర్ చర్చలు ఎలా జరుగుతాయన్నది ఆసక్తికరంగా మారింది. బ్రేవర్మన్.. రెండోసారి ఉద్వాసన ఇక రిషి మంత్రివర్గంలో సీనియర్ సభ్యురాలైన 43 ఏళ్ల బ్రేవర్మన్ హోం శాఖ మంత్రిగా తప్పుకోవాల్సి రావడం ఇది రెండోసారి! ఈసారి ఆమెపై వేటు ఒకవిధంగా ఊహిస్తున్నదే. గోవా మూలాలున్న ఆమె రెచ్చగొట్టే మాటలు, వివాదాస్పద వ్యాఖ్యలతో పలుమార్లు వివాదాల్లో చిక్కుకున్నారు. ఇటీవల లండన్‌లో జరిగిన పాలస్తీనా మద్దతుదారుల ర్యాలీని నియంత్రించడంలో పోలీసులు విఫలమయ్యారని విమర్శిస్తూ ద టైమ్స్ పత్రికలో బ్రేవర్మన్ రాసిన వ్యాసంపై ఇంటా బయటా విమర్శలు వెల్లువెత్తాయి. హోం మంత్రిగా ఉంటూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సహించరానిదంటూ విపక్షాలతో పాటు అధికార కన్సర్వేటివ్ పార్టీ సీనియర్ నాయకులు కూడా మండిపడ్డారు. వ్యాసంలోని సదరు విమర్శలను తొలగించాలని ప్రధాని కార్యాలయం ఆదేశించినా ఆమె బేఖాతరు చేసినట్టు తేలింది. ఈ నేపథ్యంలో బ్రేవర్మన్ను తప్పించడం ఖాయమని అంతా భావించారు. అంతకుముందు లిజ్ ట్రస్ మంత్రివర్గం నుంచి కూడా ఆమె రాజీనామా చేయడం విశేషం. అప్పుడు కూడా మంత్రిగా పలుసార్లు వివాదాస్పద వ్యాఖ్యాలు చేశారు. పలు కీలకాంశాలపై ట్రస్ సర్కారు అయోమయంలో ఉందని ఆమె బాహాటంగా విమర్శించడం సంచలనం సృష్టించింది. వలసదారులపై ఆమె వ్యాఖ్యలూ దుమారమే రేపాయి. తర్వాత వలసలకు సంబంధించి అధికార పత్రాలను నిబంధనలకు విరుద్ధంగా సహచర పార్టీ ఎంపీకి చూపించిన అంశంలో రాజీనామా చేయాల్సి వచి్చంది. ట్రస్ స్థానంలో రిషి ప్రధాని అయ్యాక బ్రేవర్మన్ను అనూహ్యంగా మంత్రివర్గంలోకి తీసుకోవడమే గాక మళ్లీ కీలకమైన హోం శాఖ బాధ్యతలే అప్పగించారు. దీనిపై అప్పట్లోనే ఆశ్చర్యం వ్యక్తమైంది. తాజా వేటు నేపథ్యంలో సునాక్‌కు ఆమె కంట్లో నలుసుగా మారడం ఖాయమంటున్నారు. కన్సర్వేటివ్ పారీ్టలోని తన మద్దతుదారుల దన్నుతో ప్రభుత్వానికి సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తారన్న అభిప్రాయం వినిపిస్తోంది. రాజీనామా అనంతరం విడుదల చేసిన సంక్షిప్త ప్రకటనలో ఆమె చేసిన వ్యాఖ్యలు కూడా దీన్ని బలపరిచేలానే ఉన్నాయి. ‘‘ఇంతకాలం హోం మంత్రిగా పని చేయడం నాకు గొప్ప గౌరవం. సమయం వచి్చనప్పుడు చాలా సంగతులు చెప్తా’’ అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు! వివాదాస్పద వ్యాఖ్యలు ► బ్రిటన్‌లో వీసా కాల పరిమితి ముగిసినా దేశం వీడని వారిలో అత్యధికులు భారతీయులేనన్న బ్రేవర్మన్ వ్యాఖ్యలు దుమారం రేపాయి. ► భారత్‌తో ఓపెన్ మైగ్రేషన్ విధానాన్నీ ఆమె తప్పుబట్టారు. ► మరో సందర్భంలో బ్రిట న్లోని అక్రమ వలసదారులను ఆఫ్రికాలోని రువాండాకు తరలిస్తానన్నారు. ► బ్రిటన్‌లో ఎక్కడ పడితే అక్కడ వీధుల్లోనే నివసిస్తున్న వారు చాలావరకు అక్రమ వలసదారులేనన్నారు. ► శరణార్థుల తాకిడిని వలసదారుల దండయాత్రగా అభివరి్ణంచారు. ► అతి వేగంగా కారు నడిపిన కేసులో జరిమానా, ఫైన్ పడ్డ విషయాన్ని దాచేందుకు ప్రయతి్నంచారని ఆరోపణలు ఎదుర్కొన్నారు. -
కేంద్ర కేబినెట్ విస్తరణ: పర్యాటక శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి
న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్లో 43మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రమాణం చేసిన నూతన కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు జరిగింది. తాజా సమాచారం ప్రకారం వివిధ కేంద్ర మంత్రులకు కేటాయించిన శాఖల వివరాలు ఇలా ఉన్నాయి. ► కిషన్ రెడ్డి - పర్యాటక ,సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ ► నితిన్ గడ్కరీ - రవాణా శాఖ ► రాజ్ నాథ్ సింగ్ - రక్షణ శాఖ ►మన్సుఖ్ మాండవీయ - ఆరోగ్యశాఖ కేటాయింపు ►అమిత్ షా - హోంశాఖ, సహకార శాఖ ► అర్జున్ ముండా - గిరిజన సంక్షేమం ► కిరణ్ రిజిజు - న్యాయశాఖ ► నిర్మలా సీతారామన్ - ఆర్ధిక శాఖ ►స్మృతి ఇరానీ- మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రిత్వశాఖ ► భూపేంద్ర యాదవ్ - కార్మిక శాఖ ►డాక్టర్ జై శంకర్ - విదేశీ వ్యవహారాలు ► పురుపోషత్తమ్ రూపాల - మత్స్య, పశుసంవర్దక, డెయిరీ ►పీయూష్ గోయల్ - వాణిజ్యం, పరిశ్రమలు, జౌళిశాఖ, ఆహార ప్రజా పంపిణీ ►అశ్వినీ వైష్ణవ్ - రైల్వే, ఐటీ మంత్రిత్వశాఖ ► రాజ్ కుమార్ సింగ్ - విద్యుత్, పునరుత్పాదక ఇందన శాఖ ►ధర్మేంద్ర ప్రధాన్ - విద్యా, నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వశాఖ ►హర్దీప్సింగ్ పూరీ - పెట్రోలియం, పట్టణాభివృద్ధి, గృహనిర్మాణశాఖ ►మహేంద్రనాథ్ పాండే - భారీ పరిశ్రమల శాఖ ►జ్యోతిరాదిత్య సింధియా - పౌర విమానయాన శాఖ ►గిరిరాజ్ సింగ్ - గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ ►అనురాగ్ ఠాకూర్ - సమాచార ప్రసార శాఖ ►భూపేంద్ర యాదవ్ - పర్యావరణ,అటవీశాఖ, కార్మిక శాఖ ►పశుపతి పరసు - కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ ► గజేంద్ర సింగ్ షెకావత్ - జల్ శక్తి ► సర్వానంద్ సోనోవాల్ - ఓడరేవులు, జలరవాణా, ఆయుష్ శాఖ ► ప్రహ్లాద్ జోషీ - పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు, గనుల శాఖ ► రామచంద్రప్రసాద్ సింగ్ - ఉక్కుశాఖ ► నరేంద్ర సింగ్ తోమర్ - వ్యవసాయ శాఖ ►వీరేంద్ర కుమార్ - సామాజిక న్యాయం,సాధికారత ► ముక్తార్ అబ్బాస్ నఖ్వీ - మైనార్టీ వ్యవహారాల శాఖ ► నారాయణ్ రాణే - చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ► ధర్మేంద్ర ప్రదాన్ - విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖ చదవండి : ఇరువురికీ న్యాయమైన వాటా దక్కాలి -
బిహార్ మంత్రివర్గం రాజీనామా
పట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ శుక్రవారం ఆ రాష్ట్ర గవర్నర్ ఫగూ చౌహాన్ని కలిశారు. తన మంత్రివర్గ రాజీనామాను సమర్పించి, అసెంబ్లీని రద్దుచేయాలని సిఫారసు చేశారు. దీంతో బిహార్‌లో నితీశ్ నేతృత్వంలో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. నితీశ్ రాజీనామాను గవర్నర్ ఆమోదించి, ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు అయ్యేంత వరకు తాత్కాలిక ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరారు. అంతకుముందు సీఎం అధికార నివాసంలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు జేడీయూ, బీజేపీ, హెచ్ఏఎం, వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీల నాయకులు భేటీ అయ్యారు. కొత్త ఎన్నికైన ఎన్డీయే ఎమ్మెల్యేలంతా ఆదివారం మధ్యాహ్నం సమావేశమై నితీశ్‌ను తమ నేతగా ఎన్నుకోనున్నారు. బిహార్‌లో జేడీయూ కన్నా బీజేపీ 31 స్థానాలు అధికంగా గెలుపొందినప్పటికీ, ప్రధాని, బీజేపీ అధిష్టానం నితీశ్ కుమార్‌నే కాబోయే ముఖ్యమంత్రిగా ప్రకటించడం విశేషం. ఉప ముఖ్యమంత్రిగా దళిత వర్గానికి చెందిన బీజేపీ నేత కామేశ్వర్ చౌపాల్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈయనకు సంఘ్‌పరివార్‌తో అనుబంధం ఉంది. ఇలా ఉండగా, స్వతంత్ర ఎమ్మెల్యే చకాయ్ సుమిత్ సింగ్ ఎన్డీయేకి మద్దతు ప్రకటించారు. -
ఈనెల 11న ఏపీ కేబినెట్ విస్తరణ
-
11న ఏపీ కేబినెట్ విస్తరణ
సాక్షి, అమరావతి : ఏపీ కేబినెట్ విస్తరణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చంద్రబాబు కొత్త రాజకీయాలు ప్రారంభించారు. మైనార్టీలు, ఎస్టీ వర్గాలకు మంత్రి పదవులంటూ తాయిలాలు ప్రకటించడానికి సిద్దమయ్యారు. నాలుగున్నరేళ్లుగా ఎస్టీ, మైనార్టీలకు కేబినెట్లో చంద్రబాబు చోటు కల్పించలేదు. దీంతో ఆ వర్గాల నుంచి ఎన్నికల సమయంలో వ్యతిరేకతను తగ్గించుకోవాలని చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 11న ఉదయం 11.30కు ఏపీ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు చేశారు. ప్రస్తుత శాసన మండలి ఛైర్మన్ ఎన్ఎండీ ఫరూక్‌కు మంత్రి వర్గంలో చోటు దక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన స్థానంలో ఎమ్మెల్సీ షరీఫ్‌ని శాసన మండలి ఛైర్మన్‌గా చేయనున్నట్టు సమాచారం. అలాగే గిరిజన ప్రాంతాలకు సంబంధించి టీడీపీ తరపున గెలుపొందిన ఎమ్మెల్యేగా ముడియం శ్రీనివాస్ మాత్రమే ఉన్నా, మంత్రి వర్గంలోకి ఇటీవల మావోయిస్టుల ఎన్కౌంటర్లో మృతి చెందిన ప్రభుత్వ విప్, వైఎస్సార్సీపీ నుంచి పార్టీ ఫిరాయించిన కిడారి సర్వేశ్వరరావు కుమారుడు శ్రవణ్‌ని మంత్రి వర్గంలోకి తీసుకోనున్నట్టు సమాచారం. -
‘రాజ్యాంగాన్ని నవ్వుల పాలు చేశారు’
అమరావతి: ఏపీలో రాజ్యాంగం అపహాస్యమైందని ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి అన్నారు. కొత్తగా మంత్రి వర్గంలో సీఎం చంద్రబాబు నాయుడు చేసినా మార్పులపై ఈ విధంగా స్పందించారు. ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌ను సైతం భాగస్వామ్యం చేసి బాబు రాజ్యాంగాన్ని నవ్వుల పాలు చేశారని ఉమ్మారెడ్డి విమర్శించారు. గతంలో గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని ఎన్టీఆర్ డిమాండ్ చేశారు. ఇప్పుడు అదే గవర్నర్ వ్యవస్థను అడ్డు పెట్టుకుని చంద్రబాబు రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని ఉమ్మరెడ్డి అన్నారు. -
టీఆర్ఎస్ఎల్పీ మీటింగ్‌పై మంత్రుల్లో టెన్షన్
హైదరాబాద్: టీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశంపై తెలంగాణ మంత్రుల్లో టెన్షన్ పట్టుకుంది. కేబినెట్లో మార్పులకు సంబంధించి గురువారం జరిగే ఈ సమావేశంలో స్పష్టం వచ్చే అవకాశముంది. కేబినెట్లో మార్పులు తప్పవని సీనియర్ మంత్రులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. రేపు ఉదయం తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరగనుంది. పార్టీకి, ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. నామినేటెడ్ పోస్టులను, పార్టీ పదవులను, మార్కెట్ కమిటీలను ఖరారు చేసే అవకాశముంది. -
కేబినెట్లో మార్పులు!
జపాన్ పర్యటనకు ముందే సీఎం సంకేతాలు గోదావరి పుష్కరాల తర్వాత ముహూర్తం.. కొందరికి ఉద్వాసన హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు కేబినెట్లో మార్పులు చేర్పులు చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. గోదావరి పుష్కరాలు ముగిసిన తర్వాత ఈ నెలాఖరులో లేదా వచ్చే నెల తొలివారంలో ఈ మార్పుచేర్పులు చేయాలని యోచిస్తున్నారు. ప్రస్తుతం జపాన్ దేశంలో పర్యటిస్తున్న చంద్రబాబు అక్కడికి వెళ్లడానికి ముందు కేబినెట్లో మార్పుచేర్పులపై ముఖ్యులకు సంకేతాలిచ్చారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తికావడం, కొందరు మంత్రులు అనుకున్న స్థాయిలో పనిచేయకపోవడం, మండలికి కొత్తగా ఎంపికైన పలువురిని కేబినెట్లో చేర్చుకుంటానని ఇదివరకే చెప్పిన నేపథ్యంలో ఆయన మార్పుచేర్పులపై కసరత్తు చేశారు. మంత్రుల పనితీరును వివిధ రకాల సర్వేల ద్వారా అధ్యయనం చేయించిన బాబు కొందరిని తప్పించాలన్న ఆలోచనకు వచ్చారు. ప్రస్తుతం ఉన్న వారందరినీ యధాతథంగా కొనసాగించాలని అనుకున్నా కొత్తగా మరో ఆరుగురిని కేబినెట్లో చేర్చుకోవడానికి అవకాశాలున్నాయి. పైగా కీలకమైన విద్యుత్, పరిశ్రమలు, న్యాయ, మౌలిక వసతులు, ప్రభుత్వ రంగ సంస్థలు, సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖలన్నీ సీఎం అధీనంలోనే ఉన్నాయి. కొత్తవారికి ఈ శాఖలు కేటాయించాలని గతంలోనే ఒక ఆలోచనకు వచ్చినా మండలి ఎన్నికలు కారణంగా వాయిదా వేశారు. గత సాధారణ ఎన్నికల్లో టీడీపీ తరఫున మైనారిటీ వర్గాలకు చెందిన వారెవరూ విజయం సాధించకపోవడంతో కేబినెట్లో ఆ వర్గాలకు ప్రాతినిథ్యం కూడా లేకుండాపోయింది. ఈ నేపథ్యంలో ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ నేత ఎం.ఎ.షరీఫ్‌ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. కొత్తగా కేబినెట్లో చేర్పించుకునేవారిలో ఎక్కువమంది ఎమ్మెల్సీలకు అవకాశం కల్పిస్తారన్న ప్రచారం జరుగుతోంది. నిబంధనల మేరకు గరిష్టస్థాయిలో కేబినెట్ ఏర్పాటు చేయడం, ఎవరెవరిని చేర్చుకోవడం వంటి అంశాలపై గోదావరి పుష్కరాల అనంతరం దృష్టిసారిస్తారని సన్నిహితవర్గాలు చెప్పాయి. కొందరిని తప్పించడంతోపాటు కొందరి శాఖల్లో మార్పు లు చేయనున్నారని ఆ వర్గాలు తెలిపాయి. ఎమ్మెల్సీలుగా ఎన్నికైన వారిలో పయ్యావుల కేశవ్, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, బీద రవిచంద్ర యాదవ్, మాగుంట శ్రీనివాసులురెడ్డి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎం.ఎ. షరీఫ్, గుమ్మడి సంధ్యారాణి. గాలి ముద్దుకృష్ణమ నాయుడు తదితరుల్లో ముగ్గురికి కేబినెట్లో చోటు ఖాయమని అంటున్నారు.