
సాక్షి, హైదరాబాద్: రోడ్లు, రవాణాశాఖ మంత్రిగా వేముల ప్రశాంత్‌రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. సెక్రటేరియట్ డీ–బ్లాక్‌లో తన చాంబర్‌లో సాయంత్రం 4 గంటలకు ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత ఆయనకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఆర్టీసీ కార్మిక సంఘాల నుంచి అశ్వత్థామరెడ్డి, థామస్‌రెడ్డి (టీఎంయూ), హన్మంత్ ముదిరాజ్, గోవర్ధన్ (టీజేఎంయూ), రాజిరెడ్డి, బాబు (ఈయూ) తదితరులు మంత్రిని సన్మానించారు. అధికార పార్టీ నాయకులు, అనుచరుల కోలాహలంతో ఆయన చాంబర్ సందడిగా మారింది. అనంతరం రోడ్లు–భవనాలు, ఆర్టీసీ, ఆర్టీఏ అధికారులు మంత్రిని కలసి శుభాకాంక్షలు తెలిపారు.
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయశాఖ నూతన మంత్రిగా నిరంజన్‌రెడ్డి గురువారం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సమైఖ్య రాష్ట్రంలో వ్యవసాయం కుదేలు అయిపోయిందని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. దూరదృష్టితో ప్రాజెక్టులను నిర్మించిన కేసీఆర్ రైతులను రాజులుగా చూడటమే లక్ష్యంగా పని చేస్తున్నారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో గోదావరి నదిపై ఒక్క ప్రాజెక్ట్ కూడా నిర్మించలేదని, ఇప్పుడు కాళేశ్వరం వంటి గొప్ప ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతోందన్నారు. రైతుబంధు దేశంలోనే గొప్ప పథకమని, దీని వల్ల రైతులు ఆత్మగౌరవంతో బతుకుతున్నారన్నారు. బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయనకు పలువురు ప్రజా ప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment