హైదరాబాద్: రాష్ట్రంలోని హోంగార్డులకు 3 నెలల జీతం బకాయిలు విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందని ఆ రాష్ట్ర మంత్రులు నాయిని నరసింహారెడ్డి, ఈటెల రాజేందర్లు వెల్లడించారు. బుధవారం హైదరాబాద్లో నాయిని, ఈటెల రాజేందర్లు విలేకర్లతో మాట్లాడుతూ... రానున్న రోజుల్లో పోలీసులకు వలే హోంగార్డులకు కూడా బడ్జెట్లో నిధులు కేటాయించి... నెలనెల వేతనాలు అందే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తెల్లరేషన్ కార్డుపై పేదలకు రూ.1 కే కిలో బియ్యం ప్రభుత్వం అందిస్తుందని వారు గుర్తు చేశారు. అయితే ఆ బియ్యం ధర అంతే ఉంచాలా లేక మరో రూపాయి పెంచి... మరిన్ని కేజీలు అదనంగా ఇవ్వాలా అన్న అంశంపై ప్రభుత్వం చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ అంశంపై ప్రభుత్వం సాధ్యమైనంత త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటుందని వారు వెల్లడించారు.