హైదరాబాద్ : ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిజమైన కాంగ్రెస్ వాది అని తెలంగాణ ప్రాంత మంత్రులు ప్రశంసించారు. తెలంగాణ ప్రాంత మంత్రులు మంగళవారం ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కిరణ్ హైకమాండ్కు వీరవిధేయుడన్నారు. ప్రస్తుత సమావేశాల్లోనే తెలంగాణ బిల్లుపై చర్చ పూర్తవుతుందని వారు ధీమా వ్యక్తం చేశారు. అంతకు ముందు తెలంగాణ ప్రాంత మంత్రులు....మంత్రి జానారెడ్డి ఛాంబర్లో భేటీ అయ్యారు.