'రైతు యాత్రలు కావు.. అవి విహారయాత్రలు' | oppotion enjoying holiday tour, say ministers | Sakshi
Sakshi News home page

'రైతు యాత్రలు కావు.. అవి విహారయాత్రలు'

Published Fri, Oct 9 2015 3:42 PM | Last Updated on Sun, Sep 3 2017 10:41 AM

oppotion enjoying holiday tour, say ministers

హైదరాబాద్: ప్రతిపక్ష నేతలు బస్సుయాత్రల పేరుతో విహారయాత్రలు చేస్తున్నారని తెలంగాణ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి విమర్శించారు. ఆత్యహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించే పేరిట ప్రతిపక్షాలు తలపెట్టిన యాత్రలను ఆయన తప్పుబట్టారు. గత పాలకుల అసమర్థత వల్లే రైతులకు ప్రస్తుతం ఈ దుస్థితి తలెత్తిందన్నారు. రైతుల పరిస్థితుల చక్కదిద్దేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని చెప్పారు.

మరోమంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ రైతు పక్షపాతి అని అన్నారు. యాత్రల పేరిట ప్రతిపక్షాలు నాటకాలు ఆడుతున్నాయని ఆయన విమర్శించారు. రైతుల ఆత్యహత్యలు ఎప్పటినుంచో జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. రుణమాఫీ అమలుచేయాలని తమకు కాదు, చంద్రబాబు ప్రభుత్వానికి చెప్పాలని ఆయన టీటీడీపీ నేతలకు సూచించారు. హైదరాబాద్లో కాదు ఢిల్లీలో ఆందోళనలు చేయాలని బీజేపీ నేతలకు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement