నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో శనివారం మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. బిర్కూర్ మండలం బొమ్మన్‌దేవ్‌పల్లి చౌరస్తాలో రూ.11 కోట్లతో నిర్మించే డబుల్‌లైన్ రోడ్డు పనులకు వారు శంకుస్థాపన చేశారు. అనంతరం తిమ్మాపూర్ వెంకటేశ్వరాలయంలో భక్తుల కోసం ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రారంభించారు.
రోడ్లపై కేజీ వీల్స్‌తో ట్రాక్టర్లు నడిపితే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా మంత్రి తుమ్మల రైతులను హెచ్చరించారు. రుద్రూరు వ్యవసాయ పరిశోధన కేంద్రంలో నిర్వహించిన ప్రొఫెసర్ జయశంకర్ జయంతి ఉత్సవాల్లో వారు పాల్గొన్నారు. జకోరా క్రాస్‌రోడ్డు నుంచి మొండిసడక్ వరకు రూ.35 కోట్ల డబుల్ రోడ్డు, రుద్రూరు నుంచి పొతంగల్ వరకు నిర్మించే రూ.17 కోట్ల రోడ్డు పనులను వారు శంకుస్థాపన చేశారు.