హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. అబిడ్స్ అబిడ్స్ చాపెల్ రోడ్డులోని మెథడిస్ట్ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు కేసీఆర్తో పాటు పలువురు మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్...కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ క్రిస్టియన్ సోదరులకు క్రైస్తవ భవన్ నిర్మిస్తున్నామని, జీసస్ దయతో క్రిస్మస్కు ఒకరోజు ముందే భవనానికి శంకుస్థాపన జరిగిందన్నారు.
అందుకోసం రూ.10కోట్లు విడుదల చేసినట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహముద్ అలీతో పాటు మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, తుమ్మల నాగేశ్వరరావు, కత్తి పద్మారావు, కె. కేశవరావు, ఎంపీ కవితతో పాటు పలువురు హాజరయ్యారు.
క్రిస్మస్ వేడుకల్లో కేక్ కట్ చేసిన కేసీఆర్
Published Thu, Dec 25 2014 1:27 PM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM
Advertisement
Advertisement