హైదరాబాద్: తెలంగాణ మంత్రులుగా 11 మంది ప్రమాణ స్వీకారం చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మంత్రులు ప్రమాణం చేశారు. రాజ్భవన్ లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. మహమూద్ అలీ, డాక్టర్ తాటికొండ రాజయ్య, నాయిని నర్సింహారెడ్డి, ఈటెల రాజేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, తన్నీరు హరీష్‌రావు, టి. పద్మారావు, పట్నం మహేందర్ రెడ్డి, కల్వకుంట్ల తారక రామారావు, జోగు రామన్న, గుంటకట్ల జగదీశ్వర్ రెడ్డి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిని గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందనలు తెలిపారు.
ప్రమాణం చేశారిలా...
* మహమూద్ అలీ ఉర్దూలో ప్రమాణ స్వీకారం చేశారు.
* డాక్టర్ తాటికొండ రాజయ్య పవిత్ర హృదయంతో ప్రమాణం చేశారు.
* నాయిని నర్సింహారెడ్డి పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేశారు.
* ఈటెల రాజేందర్ పవిత్ర హృదయంతో ప్రమాణం చేశారు.
* పోచారం శ్రీనివాస్‌రెడ్డి దైవసాక్షిగా ప్రమాణం చేశారు.
* తన్నీరు హరీష్‌రావు దైవసాక్షిగా ప్రమాణం చేశారు.
* టి.పద్మారావు దైవసాక్షిగా ప్రమాణం చేశారు.
* పట్నం మహేందర్ రెడ్డి దైవసాక్షిగా ప్రమాణం చేశారు.
* కల్వకుంట్ల తారక రామారావు పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేశారు.
* జోగు రామన్న దైవసాక్షిగా ప్రమాణం చేశారు.
* గుంటకట్ల జగదీశ్వర్ రెడ్డి పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేశారు.
తెలంగాణ మంత్రులు వీరే
Published Mon, Jun 2 2014 8:41 AM | Last Updated on Wed, Aug 15 2018 9:20 PM
Advertisement
Advertisement