
సిడబ్ల్యూసి నిర్ణయానికి లోబడే నివేదిక: జానారెడ్డి
రాష్ట్ర విభజనకు సంబంధించి కేంద్రం కోరిన విధంగా 11 అంశాలపై నివేదిక సమర్పించడానికి కసరత్తు చేస్తున్నట్లు మంత్రి జానారెడ్డి చెప్పారు.
హైదరాబాద్: రాష్ట్ర విభజనకు సంబంధించి కేంద్రం కోరిన విధంగా 11 అంశాలపై నివేదిక సమర్పించడానికి కసరత్తు చేస్తున్నట్లు మంత్రి జానారెడ్డి చెప్పారు. ఉపముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ నివాసంలో జరిగిన తెలంగాణ మంత్రుల సమావేశం ముగిసింది. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సమావేశంలో అందరి అభిప్రాయాలు తెలుసుకున్నట్లు తెలిపారు. తమ నివేదికను రేపు మధ్యాహ్నం పీసీసీకి అందజేస్తామని చెప్పారు.
జీఓఎంకు పీసీసీ ఇచ్చే నివేదిక కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సిడబ్ల్యూసి) నిర్ణయానికి లోబడి ఉండాల్సిందేనని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు చెప్పినట్లు తెలిపారు. విభజన వల్ల తలెత్తే సమస్యలను సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు కూడా చెప్పవచ్చునన్నారు. తెలంగాణ ఏర్పాటు అంశంపై ఈ రాత్రికి రాష్ట్రపతిని కలుస్తామని జానారెడ్డి చెప్పారు.