తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ మంత్రులవన్నీ పలికిమాలిన తీర్మానాలేనని టీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు.
హైదరాబాద్: తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ మంత్రులవన్నీ పలికిమాలిన తీర్మానాలేనని టీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. టీ. మంత్రులు సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో డిన్నర్ చేస్తూ కాలయాపన చేస్తున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యేలు హరీష్ రావు, జూపల్లి కృష్ణారావులు విమర్శించారు. సీఎం అవలంభిస్తున్న తీరుపై వారు సోమవారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ మంత్రుల తీర్మానాలు శుద్ధ దండగేనన్నారు. సీఎం కిరణ్ ప్రస్తుతం అవలంభిస్తున్న తీరు వల్ల ఇరుప్రాంతాల ప్రజలకు అన్యాయం జరుగుతున్నదని వారు తెలిపారు.
ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన పనులను ఆపుతున్నారే కానీ సచివాలయం కేంద్రంగా టెండర్లపై సంతకాలు చేస్తున్నారన్నారు. రేషన్ కార్డు కోసం సీఎం సొంత జిల్లాలోనే ప్రజలు ఉద్యమాలు చేస్తున్నారన్నారు.