
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పలువురు మంత్రులు ఈ ఉదయం ఓటు హక్కు వినియోగించుకున్నారు.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పలువురు మంత్రులు ఈ ఉదయం ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా సామాన్యుల్లా వరుసలో నిలబడి ఓటు వేశారు. ఓటర్లు అందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా పిలుపునచ్చారు.
సూర్యాపేట జిల్లా
మంత్రి జగదీష్ రెడ్డి కుటుంబ సమేతంగా వచ్చి సూర్యాపేట శ్రీ చైతన్య స్కూల్ లో 82వ నెంబర్ బూత్ లో ఓటు వేశారు.
కామారెడ్డి జిల్లా
బాన్సువాడ మండలం పోచారం గ్రామంలో సతీమణితో కలిసి మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
సిద్దిపేట జిల్లా
మంత్రి హరీశ్‌రావు దంపతులు సిద్దిపేటలోని 102వ పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ప్రజలంతా ఓటు వేయాలని ఈ సందర్భంగా హరీశ్‌రావు పిలుపునిచ్చారు.