cast vote
-
70 స్థానాల్లో కొనసాగుతున్న పోలింగ్.. ఓటేసిన పలువురు నేతలు
-
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు.. ఓటేసిన ప్రముఖులు
-
ఓటేసిన వ్యాపార ప్రముఖులు
ముంబై: లోక్‌సభ ఎన్నికల ఐదో దశ పోలింగ్‌లో ముంబైలోని ఆరు లోక్‌సభ స్థానాలకు సోమవారం ఎన్నికల పోలింగ్ జరిగింది. ముంబైలో పలువురు వ్యాపార, పారిశ్రామిక ప్రముఖులు పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.రిలయన్స్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్, ఛైర్మన్ ముఖేష్ అంబానీ, ఆయన సతీమణి నీతా అంబానీ, వారి కుమారుడు ఆకాష్ అంబానీతో కలిసి ముంబైలోని మలబార్ హిల్‌లో ఓటు వేశారు. #WATCH | Reliance Industries Chairman Mukesh Ambani, Founder and Chairperson of Reliance Foundation Nita Ambani along with their son arrive at a voting centre in Mumbai to cast their vote for #LokSabhaElections2024 pic.twitter.com/R97TSDysam— ANI (@ANI) May 20, 2024 ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా తన సహాయకుడు శంతను నాయుడుతో కలిసి ముంబైలోని కోల్బాలోని పోలింగ్ బూత్ వచ్చి ఓటు వేశారు. అనిల్ అంబానీ ముంబైలోని పోలింగ్ బూత్ వద్ద క్యూలో నిలబడి ఓటింగ్ ప్రారంభమయ్యే వరకు ఎదురు చూసి మరి ఓటు హక్కును వినియోగించుకున్నారు. #WATCH | Industrialist Anil Ambani stands in a queue at a polling booth in Mumbai, as he waits for the voting to begin.#LokSabhaElections2024 pic.twitter.com/UUCC9iOmyu— ANI (@ANI) May 20, 2024 ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా పెద్దార్ రోడ్‌లోని పోలింగ్ బూత్‌లో కూతురు అనన్య బిర్లాతో కలిసి ఓటు వేశారు. మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా ముంబైలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. The privilege of deciding who will govern us…It’s a blessing. Never turn your back on a blessing… pic.twitter.com/rkSAr2CQMh— anand mahindra (@anandmahindra) May 20, 2024 ముంబైలోని పెద్దార్ రోడ్డు సమీపంలో తన కుటుంబంతో కలిసి ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఓటు వేశారు. జెట్ ఎయిర్వేస్ మాజీ ఛైర్మన్ నరేష్ గోయల్, హెచ్డీఎఫ్సీ మాజీ ఛైర్మన్ దీపక్ పరేఖ్ ముంబైలోని పోలింగ్ స్టేషన్లో ఓటు వేశారు.VIDEO | Lok Sabha Elections 2024: "I, along with my family cast our votes together. It is a very proud moment for every Indian and it is a moment of pride to participate in an election of 140 crore people," says RBI governor Shaktikanta Das (@DasShaktikanta) after casting his… pic.twitter.com/YEPMHmKCqn— Press Trust of India (@PTI_News) May 20, 2024 -
రతన్‌టాటా.. అణువణువూ ఆదర్శమే..!
ముంబై: లోక్‌సభ ఎన్నికల ఐదో దశలో ముంబైలోని ఆరు లోక్‌సభ స్థానాలకు సోమవారం ఎన్నికల పోలింగ్ జరిగింది. భారత ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా ముంబైలోని కోల్బాలోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు.అణువణువూ ఆదర్శమే..వాస్తవానికి ఎలక్షన్ కమిషన్ ఈసారి 85 ఏళ్లు పైబడిన వారికి పోలింగ్ కేంద్రానికి వచ్చే పని లేకుండా ఇంటి నుంచే ఓటు వేసే అవకాశాన్ని కల్పించింది. కానీ 86 ఏళ్ల రతన్ టాటా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేసి ఆదర్శంగా నిలిచారు. తన సహాయకుడు శంతను నాయుడుతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చిన రతన్‌టాటా అక్కడి పోలింగ్ సిబ్బందితో హుషారుగా ముచ్చటిస్తూ కనిపించారు.అందరూ ఓటేయాలని పిలుపుముంబైలో ఓటు వేయడానికి రెండు రోజుల ముందే రతన్ టాటా నగరంలోని ఓటర్లందరూ బాధ్యతాయుతంగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. “ముంబయిలో సోమవారం ఓటింగ్ రోజు. ముంబైవాసులందరూ బయటలకు వెళ్లి బాధ్యతాయుతంగా ఓటు వేయాలని నేను కోరుతున్నాను” అని ఆయన శనివారం ‘ఎక్స్’ (ట్విటర్)లో పోస్ట్ చేశారు. Monday is voting day in Mumbai. I urge all Mumbaikars to go out and vote responsibly.— Ratan N. Tata (@RNTata2000) May 18, 2024 -
ఓటేసిన అంబానీ దంపతుల విన్నపం ఇదే..
ముంబై: లోక్‌సభ ఎన్నికల ఐదో దశ పోలింగ్‌లో సెలబ్రిటీలు, ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్, ఛైర్మన్ ముఖేష్ అంబానీ, ఆయన సతీమణి నీతా అంబానీ, వారి కుమారుడు ఆకాష్ అంబానీతో కలిసి సోమవారం ముంబైలోని మలబార్ హిల్‌కి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఓటు వేసిన అనంతరం రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్పర్సన్ నీతా అంబానీ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు కీలక పాత్రను నొక్కిచెప్పారు. ‘దేశ పౌరులుగా ఓటు వేయడం చాలా ముఖ్యం. ఓటు వేయడం మన హక్కు, బాధ్యత. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతున్నాను" అని ఆమె వ్యాఖ్యానించారు. ముఖేష్ అంబానీ ఇవే భావాలను వ్యక్తీకరించారు. "ప్రతి భారతీయుడు ఓటు వేయాలి. ఇది నాతోటి ప్రజలకు నా విజ్ఞప్తి" అని పేర్కొన్నారు.లోక్‌సభ ఎన్నికల ఐదో దశలో ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలలోని 49 స్థానాలకు పోలింగ్ జరిగింది. 695 మంది అభ్యర్థుల పోటీలో ఉన్నారు. వీరిలో రాజ్‌నాథ్ సింగ్, రాహుల్ గాంధీ, స్మృతి ఇరానీ, రాజీవ్ ప్రతాప్ రూడీ, పీయూష్ గోయల్, ఉజ్వల్ నికమ్, చిరాగ్ పాశ్వాన్, ఒమర్ అబ్దుల్లా వంటి ప్రముఖలు ఉన్నారు.#WATCH | Reliance Industries Chairman Mukesh Ambani, Founder and Chairperson of Reliance Foundation Nita Ambani along with their son arrive at a voting centre in Mumbai to cast their vote for #LokSabhaElections2024 pic.twitter.com/R97TSDysam— ANI (@ANI) May 20, 2024 -
సమయం మించిపోతోంది.. రండి.. ఓటేయండి (ఫొటోలు)
-
ఓటు హక్కు వినియోగించుకున్న టాలీవుడ్ ప్రముఖులు
-
ప్రశాంతంగా ఓటు వెయ్యండి మంచి చేసే వారికే ఓటు వెయ్యండి
-
ఓటు హక్కు వినియోగించుకున్న వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి
-
ఓటు వేసిన YSRCP నేతలు
-
ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి
-
ప్రజలంతా మనసాక్షితో ఓటు వేయాలి - అనిల్ కుమార్
-
ఓటు హక్కు వినియోగించుకున్న వైఎస్ భారతి
-
శిల్పా రవికి తన మద్దతు ఎప్పుడూ ఉంటుంది: అల్లు అర్జున్
-
మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోండి
-
కుప్పంలో విజయం నాదే
-
ఓటు హక్కు వినియోగించుకున్న అల్లు అర్జున్, ఎన్టీఆర్
-
ఓటేద్దాం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం
-
లైన్ లో నిలబడి ఓటు వేసిన స్టార్లు..
-
నడుస్తున్న ప్రగతికి ఓటెయ్యండి..
-
ఓటుహక్కు వినియోగించుకున్న టాలీవుడ్ నటి, నటులు
-
ఓటుహక్కు వినియోగించుకున్న ఈటెల రాజేందర్
-
ఓటు హక్కు వినియోగించుకున్న వైఎస్ షర్మిల
-
ఓటు వేసిన సీఎం కేసీఆర్
-
పోలింగ్ బూత్ లో సందడి చేసిన అక్కినేని ఫ్యామిలీ
-
ఓటుహక్కు వినియోగించుకున్న టాలీవుడ్ ప్రముఖులు
-
ఓటు వేసిన VVS లక్ష్మణ్, మిథాలీ రాజ్
-
కర్ణాటక ఎన్నికలు: పెళ్లి దుస్తుల్లో ముస్తాబై ఓటేసిన వధువు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. రాష్ట్రంలోని మొత్తం 224 స్థానాలకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో.. బీజేపీ, కాంగ్రెస్, జీడీఎస్ మధ్యే ప్రధానంగా పోరు నడుస్తోంది. మొత్తం 2,165 మంది అభ్యర్థులు బరిలో ఉండగా ఓటింగ్ కోసం 58,545 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మే 13న ఫలితాలు వెల్లడి కానునఆనయి. కాగా అసెంబ్లీ పోలింగ్‌లో భాగంగా చిక్కమగళూరు జిల్లాలో అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. తన పెళ్లి రోజు ఓ వధువు ఓటేసేందుకు పోలింగ్ బూత్‌కు వచ్చింది. మకొనహలి గ్రామానికి చెందిన ఓ యువతి పెళ్లి దస్తుల్లో ముస్తాబై ముదిగేరే అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటేసింది. మరికొన్ని గంటల్లో పెళ్లి ఉండగా.. పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేసిన వధువును ఎన్నికల అధికారులు అభినందించారు. కాగా ముదిగెరె నియోజకవర్గంలో బీజేపీ నుంచి దీపక్ దొడ్డయ్య, జేడీఎస్ ఎంపీ కుమారస్వామి, కాంగ్రెస్ నుంచి నయన జ్యోతి ఝవార్ మధ్య పోటీలో నిలిచారు. చదవండి: Karnataka Elections 2023: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు.. లైవ్ అప్డేట్స్ #WATCH | Infosys founder Narayana Murthy arrives at a polling booth in Bengaluru to cast his vote.#KarnatakaElections pic.twitter.com/uhQv2RMUVU — ANI (@ANI) May 10, 2023 కర్ణాటక ఎన్నికల్లో ఇప్పటి వరకు పలువురు ప్రముఖులు ఓటేశారు. ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి, ఆయన సతీమణి సుధా మూర్తి బెంగళూరులోని జయనగర్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నందన్ నీలేఖని బెంగళూరులోని కొరమంగళ పోలింగ్ కేంద్రంలో ఓటేశారు. నిర్మలా సీతారామన్, సీఎం బసవరాజ్ బొమ్మై, బీఎస్ యడ్యూరప్ప, డికే శివకుమార్, సిద్ధ రామయ్య, సినీనటులు ప్రకాష్‌రాజ్, కాంతారా ఫేం రిషభ్ షెట్టి, గణేష్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. #WATCH | "I've been constantly saying that Congress will get 130 plus seats, it may go up to 150 seats also," says Former Karnataka CM and Congress leader Siddaramaiah#KarnatakaAssemblyElection2023 pic.twitter.com/65LX8TODut — ANI (@ANI) May 10, 2023 వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌కు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. అయితే గడిచిన 38 ఏళ్లుగా కర్ణాటకలో ఏ ఒక్క పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి రాలేదు. ఈ సెంటిమెంట్‌ను బ్రేక్ చేయాలని బీజేపీ భావిస్తుండగా.. దక్షిణాది రాష్ట్రంలో సత్తా చాటి దేశ రాజకీయాల్లో తన ప్రతిష్టను పెంచుకోవాలని కాంగ్రెస్ చూస్తోంది. ఇక ‘హంగ్’పై జేడీఎస్ మరోసారి ఆశలు పెట్టుకుంది. #WATCH | "I am 200% confident Congress party will have 141 seats. We will win an absolute majority..," says Karnataka Congress president DK Shivakumar#KarnatakaAssemblyElection2023 pic.twitter.com/0wlj5wkQ57 — ANI (@ANI) May 10, 2023 -
సామాన్యుడిలా క్యూలో వెళ్లి ఓటేసిన మోదీ.. కాంగ్రెస్ విమర్శలు!
గాంధీనగర్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్‌లో ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయమే గాంధీనగర్ రాజ్‌భవన్ నుంచి అహ్మదాబాద్ చేరుకుని తన ఓటు హక్కు వినియోగించుకున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. రాణిప్ ప్రాంతంలోని నిషాన్ పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఒక సామాన్యుడిలా క్యూ లైన్లో నిలబడి తన వంతు వచ్చిన తర్వాత ఓటు వేశారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. రోడ్ షో అంటూ.. కాంగ్రెస్ విమర్శలు అహ్మదాబాద్‌లో ఓటు వేసేందుకు వెళ్లిన ప్రధాని మోదీ.. పోలింగ్ కేంద్రానికి కొద్ది దూరంలోనే కాన్వాయ్‌ని నిలిపేసి నడుచుకుంటూ వెళ్లారు. ఈ క్రమంలో ప్రధానిని చూసేందుకు వేలాదిమంది అభిమానులు తరలివచ్చారు. వారికి అభివాదం చేసుకుంటూ పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు మోదీ. ఓటు వేసి తిరిగి వెళ్లేప్పుడు సైతం అభిమానులకు అభివాదం చేసుకుంటూ వెళ్లారు. ఈ క్రమంలో పోలింగ్ కేంద్రానికి ప్రధాని నడుచుకుంటూ వెళ్లడంపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి మోదీ రోడ్ షో నిర్వహించారని ఆరోపించింది. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం మౌనంగా ఉండటం విచారకరమని విమర్శించింది. మరోవైపు.. ప్రధాని మోదీ, బీజేపీపై విమర్శలు గుప్పించారు టీఎంసీ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఓటింగ్ సమయంలో రోడ్ షో లాంటి కార్యక్రమం చేపట్టడమేంటని ప్రశ్నించారు. వారు ప్రత్యేకమైన వ్యక్తులు అంటూ విమర్శించారు. ఎన్నికల రోజున రోడ్ షోలపై నిషేధం ఉంటుందని, కానీ వారు అందుకు మినహాయింపు అంటూ దుయ్యబట్టారు. PM #NarendraModi ji casted his vote,it's time for people of #Gujarat to caste thier vote for our bright future and coming generations!#GujaratElections2022 pic.twitter.com/pKyXMF2cc1 — Weisel🇮🇳 (@weiselaqua) December 5, 2022 ఇదీ చదవండి: Gujarat Assembly Elections 2022: మధ్యాహ్నం 3 గంటల వరకు 50శాతం ఓటింగ్ -
అహ్మదాబాద్ లో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రధాని మోదీ
-
ఓటేసి వెళ్లి కన్యాదానం.. లండన్ నుంచి రాక
అమ్మ వస్తుంది... ఏడవకు ఉమ్మడి నల్లగొండ జిల్లా భువనగిరి పట్టణంలోని పోలింగ్ కేంద్రానికి ఓ మహిళా ఓటరు తన కుమార్తెతో కలిసి వచ్చింది. ఆ చిన్నారిని ఓ మహిళా కానిస్టేబుల్ ఎత్తుకోగా బిగ్గరగా ఏడవడంతో.. ఆమెను బుజ్జగించేందుకు ఇద్దరు మహిళా పోలీసులు ప్రయత్నించారు. అయినా ఏడుపు ఆపకపోవడంతో ఆ చిన్నారిని తల్లితో పాటు పోలింగ్ కేంద్రంలోనికి అనుమతించారు. దీంతో ఆమె తన కూతురిని ఎత్తుకుని ఓటు వేసింది. ఒకరికి బదులు మరొకరు ఉమ్మడి మెదక్ జిల్లా సంగారెడ్డి టీఎన్జీఓ భవన్ పోలింగ్ కేంద్రంలో కాంగ్రెస్ ఎంపీటీసీ కె.సునీతకు బదులు అదే పేరు ఉన్న మరో జెడ్పీటీసీ ఓటేయడం గందరగోళానికి దారితీసింది. ఆమె అధికారులతో వాగ్వాదాని కి దిగగా..వారు పొరపాటును గ్రహించి తప్పును సరిదిద్దడంతో వివాదం సద్దుమణిగింది. లండన్ నుంచి రాక ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకపల్లి ఎంపీటీసీగా టీఆర్ఎస్ తరఫున గెలిచిన చిలుకూరి శ్యామల ఆ తర్వాత ఉన్నత చదువుల నిమిత్తం లండన్ వెళ్లారు. అయితే, పార్టీ తరఫున గెలిచిన వారంతా తప్పక ఓటు వేయాలని అధిష్టానం సూచించడంతో ఆమె కొద్దిరోజుల క్రితం హైదరాబాద్‌కు చేరుకున్నారు. శుక్రవారం అక్కడి నుంచి కల్లూరు ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని ఓటు వేశారు. పుట్టెడు శోకంలోనూ.. నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం బాలాజీనగర్‌కు చెందిన టీఆర్ఎస్ ఎంపీటీసీ సభ్యుడు మెఘావత్ బన్సీలాల్ కుమారుడు రమేష్ అనారోగ్యంతో గురువారం రాత్రి మృతి చెందాడు. శుక్రవారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించారు. కాగా అంత్యక్రియలు ముగిసిన వెంటనే పుట్టెడు శోకాన్నీ దిగమింగుకుంటూ బన్సీలాల్ బంధువుల సాయంతో వచ్చి దేవరకొండలో ఓటు హక్కు వినియోగించుకున్నాడు. పోలింగ్ కేంద్రం వద్ద తోటి ఎంపీటీసీ సభ్యులను చూసి బోరున విలపించాడు. ఓటేసి వెళ్లి కన్యాదానం కూతురి పెళ్లి ఉన్నా బాధ్యత మరవకుండా ఓటేశాడు ఉమ్మ డి మెదక్ జిల్లా అందోలు మండల పరిధిలోని రాంసానిపల్లి ఎంపీటీసీ సభ్యుడు గజేందర్‌రెడ్డి. ఉదయం 8.30 గంటలకు ఓటేసిన ఆయన, జోగిపేటకు 30 కి.మీ దూరంలో ఉన్న సంగారెడ్డిలోని ఫంక్షన్ హాలుకు వెళ్లి కన్యాదానం చేశాడు. దుఃఖాన్ని దిగమింగుకుంటూ.. ఉమ్మడి మెదక్ జిల్లా కొల్చారం జెడ్పీటీసీ సభ్యురాలు మేఘమాల సోదరుడు మధుసూదన్ సంగారె డ్డిలో పోలీస్‌శాఖలో పనిచేస్తున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున ఆయన గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. తమ్ముడి మరణ వార్తతో కుప్పకూలిన మేఘమాల, దుఃఖాన్ని దిగమింగుకుంటూ, ఓటేసిన అనంతరం స్వగ్రామానికి వెళ్లారు. -
విజయవాడలో పుర‘పోల్’ సిత్రాలివే!
సాక్షి, అమరావతి బ్యూరో: తాజాగా జరిగిన విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లోనూ కొన్ని ఆసక్తికర పరిణామాలు వెలుగు చూశా యి. ఈ ఎన్నికల బరిలో ఉన్న ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులకు ఒక్కటంటే ఒక్క ఓటూ పడలేదు. అంటే వారి ఓటు కూడా వారు వేసుకోలేదన్న మాట! నగరంలోని 9వ డివిజన్లో బొల్లినేని లక్ష్మీ సంధ్య, 46వ డివిజన్లో దిల్ షాద్ బేగంలు ‘0’ ఓట్లు సాధించిన ఘనతను చాటుకున్నారు. అలాగే 9వ డివిజన్‌లోనే కన్నా లక్ష్మి, 59వ డివిజన్లో ఎండీ వహీదా పర్వీన్, 60వ డివిజన్లో ఎండీ నజీమాలకు ఒక్కొక్క ఓటు మాత్రమే పోలయ్యాయి. రెండేసి ఓట్లు తెచ్చుకున్న వారిలో 60వ డివిజన్లో ఎం. మాధవి, 31వ డివిజన్లో కె.విజయశ్రీలు ఉన్నారు. ఇక 20వ వార్డులో జె.బాలాజీ, 40వ డివిజన్లో సీహెచ్. రామునాయుడులు మూడేసి ఓట్లు లభించాయి. ఇలా నాలుగు ఓట్లు తెచ్చుకున్న వారు ఐదుగురు, ఐదుఓట్లు లభించిన వారు ఏడుగురు, ఆరు ఓట్లు వచ్చిన వారు ఒక రు, ఏడు ఓట్లు పోలైన వారు ఆరుగురు, ఎనిమిది ఓట్లు దక్కిన వారు ఐదుగురు, తొమ్మిది ఓట్లు పొందిన వారు ఒకరు, పది ఓట్లు వచ్చిన వారు ఒకరు చొప్పున ఉన్నారు. ఇలా విజయవాడ నగరపాలకసంస్థలో వివిధ డివిజన్లలో పది లోపు ఓట్లను పొందిన స్వతంత్ర అభ్యర్థులు 35 మంది ఉన్నారు. వీరిలో 24 మంది మహిళా అభ్యర్థులే కావడం విశేషం! ఇదీ సంగతి..! కొందరు అభ్యర్థులు అత్యల్పంగా ఓట్లు తెచ్చుకోవడానికి కొన్ని కారణాలున్నాయి. నామినేషన్ల దాఖలు సమయంలో అభ్యర్థితో పాటు డమ్మీ అభ్యర్థులతోనూ వేయిస్తారు. ఉపసంహరణ సమయంలో డమ్మీ అభ్యర్థులు బరి నుంచి తప్పిస్తారు. దీంతో బరిలో అసలు అభ్యర్థులే మిగులుతారు. అయితే కొంతమంది ప్రధాన అభ్యర్థులు కౌంటింగ్ ఏజెంట్లుగాను, బూత్ ఏజెంట్లుగాను పనికొస్తారన్న ఉద్దేశంతో వారిని కొనసాగిస్తారు. ఇలాంటి వారిని నిబంధనల ప్రకారం అధికారులు స్వతంత్ర అభ్యర్థులుగా పరిగణిస్తారు. వీరు తమ ఓటును కూడా తమకు వేసుకోరు. దీంతో వీరికి ‘0’ ఓట్లు పడినట్టు రికార్డుల్లోకి ఎక్కుతారు. ఒకవేళ ఎవరైనా పొరపాటున వేస్తే మాత్రం స్వల్ప ఓట్లు వీరి ఖాతాలో జమ అవుతాయ. అయితే మరికొంతమంది ఉద్దేశపూర్వకంగానే నామినేషన్లు దాఖలు చేస్తారు. ఫలానా ఎన్నికల్లో పోటీ చేశాను.. అని చెప్పుకోవడానికి అలా వేస్తుంటారు. అలాంటి వారు ఎన్నికల్లో ప్రచారం కూడా చేయరు. తనకు ఓటేయమని జనంలోకి వెళ్లి అడగరు. వీరికి తన ఓటుతో పాటు తమ కుటుంబ సభ్యుల, స్నేహితుల ఓట్లు నామమాత్రంగా పడతాయి. చర్చకు దారితీస్తాయి. చదవండి: ఓ అభ్యర్థికి ఒక్క ఓటూ పడలేదు.. -
పంచాయతీ ఎన్నికలు: మీ ఓటు ఇలా వేయండి
సాక్షి, కాకినాడ : తొలి విడత ఎన్నికల పోలింగ్ మంగళవారం జరగనుంది. ఓటు హక్కు పొందిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ప్రలోభాలకు లొంగకుండా నిస్వార్థమైన నాయకుడుకి ఓటు వేయాలి. ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 వరకూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ► ఓటు వేసేందుకు ఓటరు స్లిప్పు తప్పనిసరి. ► ఇప్పటికే గ్రామ పంచాయతీల్లో సిబ్బంది ఇంటింటికీ వచ్చి ఫొటోలతో ఉన్న ఓటరు స్లిప్పులు పంపిణీ చేశారు. ► ఒక వేళ ఎవరికైనా ఓటరు స్లిప్పు అందకపోతే వారు పోలింగ్ కేంద్రం వద్ద పంచాయతీ కార్యాలయ సిబ్బంది అక్కడే ఓటరు స్లిప్పులు అందిస్తారు. ► ఓటరు స్లిప్పుతో పాటు గుర్తింపు కార్డు తీసుకెళ్లాలి. ► ఓటరు కార్డు, ఆధార్, రేషన్, బ్యాంకు పాస్‌పుస్తకం, పాస్‌పోర్టు ఇలా ఒక గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకువెళ్లాలి. ► కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ క్యూలో నిలబడాలి. ► తప్పనిసరిగా ముఖానికి మాస్క్ ఉండాలి. ► క్యూలో నిల్చున్న వారికి ఎన్నికల సిబ్బంది రెండు బ్యాలెట్లు ఇస్తారు. ► సర్పంచ్ బ్యాలెట్, వార్డు సభ్యుడి బ్యాలెట్ ఇస్తారు. వాటితోపాటు స్వస్తిక్ గుర్తు సిరాలో ముంచి ఇస్తారు. ► బ్యాలెట్‌పై తనకు నచ్చిన వ్యక్తి గుర్తుపై స్వస్తిక్ గుర్తు వేయాలి. ► పోలింగ్ సిబ్బంది చెప్పిన ప్రకారం బ్యాలెట్‌ను మడత పెట్టాలి. ► లేకుంటే మనం ఓటు వేసి సిరా వేరే గుర్తుపై పడే అవకాశం ఉంది. ► ఇలా జరిగితే ఆ బ్యాలెట్ చెల్లదు. ► ఓటు వేయలేని వృద్ధులు, వికలాంగులు సహాయకుల సహాయంతో ఓటు హక్కు వినియోగించుకొనే అవకాశం ఉంది. ► దీనికి ముందుగా సంబంధింత పోలింగ్ కేంద్రంలో పోలింగ్ అధికారి అనుమతి తీసుకోవాలి. ► వికలాంగులు, వృద్ధులు వారికి నచ్చిన వ్యక్తులను సహాయకులు ఎంచుకోవచ్చు. ► కరోనా సోకిన వ్యక్తి ఓటు వేయడానికి అవకాశం కలి్పంచారు. ► ఆఖరి గంటలో స్థానిక ఆరోగ్య శాఖ సిబ్బంది సహాయంతో తగు భద్రతా ప్రమాణాలు పాటించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ► ఓటు వేసి సెల్ఫీ తీసుకుంటే సంబంధిత ఓటును రద్దు చేసే అధికారం పోలింగ్ అధికారికి ఉంది. ఒక ఓటరు.. రెండు ఓట్లు రాయవరం: గత పార్లమెంట్, అసెంబ్లీ సాధారణ ఎన్నికల మాదిరిగానే ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లోనూ ఒక ఓటరు రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది. పార్లమెంట్, అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో ఓటరు ఓటింగ్ యంత్రాలపై ఓటు వేయగా, ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో ఓటరు బ్యాలెట్ పేపరుపై ఓటు వేయాల్సి ఉంటుంది. ఒక ఓటు సర్పంచ్ బరిలో నిలిచిన అభ్యర్థికి, మరో ఓటు బరిలో నిలిచిన వార్డు అభ్యరి్థకి వేయాల్సి ఉంటుంది. సర్పంచ్ అభ్యర్థులకు గులాబీ, వార్డు అభ్యర్థులకు తెలుపు రంగు బ్యాలెట్ పేపరును ఓటర్లకు అందజేస్తారు. సర్పంచ్ అభ్యర్థి పోటీలో ఉండి, వార్డు పదవి ఏకగ్రీవమైతే ఓటరు ఒక ఓటు మాత్రమే వేయాల్సి ఉంటుంది. అలా కాకుండా సర్పంచ్ పదవి ఏకగ్రీవమై, వార్డు పదవికి పోటీ జరిగితే అప్పుడు కూడా ఓటరుకు ఒక ఓటు మాత్రమే ఇస్తారు. చదవండి: ఏపీ: ఒకరి ఓటు మరొకరు వేస్తే ఏమవుతుంది? పోలింగ్ సమయంలో సెల్ఫీ దిగితే.. -
జీహెచ్ఎంసీ ఎన్నికలు: గడప దాటి వచ్చేవారెందరు..?
సాక్షి,హైదరాబాద్: వరుసగా నాలుగు రోజులు సెలవులొచ్చాయంటే చాలు సిటీజనులు ఆకస్మాత్తుగా జంప్‌జిలానీలవుతారు. ఏ టూరిస్ట్ ప్లేస్‌కో.. లేదంటే సొంత ఊళ్లకో పరుగులు తీస్తారు. ఆ నాలుగు రోజులు సరదాగా గడిపి వచ్చేస్తారు. సహజంగానే ఎన్నికల పట్ల పెద్దగా ఆసక్తి లేని వర్గాలకు ఈ వరుస సెలవులు ఒక వరంలా మారుతున్నాయి. డిసెంబర్ 1వ తేదీన జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలకు కూడా వరుస సెలవుల గండం వచి్చపడింది. ఆఖరు శనివారం బ్యాంకు కార్యకలాపాలకు సెలవు, ఆదివారం సంగతి సరే సరి. సోమవారం గురునానక్ జయంతి. ఇక మంగళవారం పోలింగ్ రోజు ఎలాగూ సెలవు ఉంటుంది. అందుకే నగరవాసులు ఛల్ మోహనరంగా అంటే ఊరుకు చెక్కేసేందుకు సన్నద్ధమవుతున్నారు. మరోవైపు కోవిడ్ దృష్ట్యా సాఫ్ట్వేర్ సంస్థలు ‘వర్క్‌ఫ్రమ్ హోమ్’ వెసులుబాటునివ్వడంతో చాలా మంది టెకీలు సొంత ఊళ్లకు వెళ్లిపోయారు. డిసెంబర్ నెలాఖరు వరకు వాళ్లు ఊళ్లకే పరిమితమవుతారు. సాధారణంగానే ఎన్నికలకు దూరంగా ఉండే టెకీలు ఈ ఎన్నికల్లో కూడా వర్క్‌ఫ్రమ్ హోమ్ కారణంగా దూరంగానే ఉండే అవకాశం ఉంది. మధ్యతరగతి, సాఫ్ట్వేర్ వర్గాలు తమ ఓటు హక్కును వినియోగించుకోపోవడం వల్లనే గత మున్సిపల్ ఎన్నికల్లో 45 శాతం పోలింగ్ మాత్రమే నమోదైనట్లు స్వచ్ఛంద సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఓటు హక్కు ఉన్న ప్రతి పౌరుడు బాధ్యతగా ఓటు వేయాలని, ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ఎన్నికల నిఘా వేదిక వంటి సంస్థలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. కానీ రాజకీయాల పట్ల మధ్యతరగతి ప్రజల్లో ఉండే విముఖత పోలింగ్ పైన ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఓపిగ్గా పోలింగ్ బూత్‌లకు వచ్చి ఓటేస్తారా..? లాక్డౌన్ నిబంధనలను పూర్తిగా సడలించడంతో జనం చాలా వరకు ఇళ్ల నుంచి బయటకు వచ్చేశారు. ఉద్యోగ, వ్యాపార కార్యకలాపాలు సాధారణమయ్యాయి. 70 శాతం ప్రజలు బయట తిరుగుతుండగా 30 శాతం మాత్రమే ఇళ్లలో ఉంటున్నట్లు సమాచారం. పోలింగ్ రోజు సెలవు కావడం వల్ల జనమంతా ఇళ్లకే పరిమితమవుతారు. ఓపిగ్గా పోలింగ్ బూత్‌లకు వచ్చి ఓటేస్తారా..? అనేది సందేహాస్పదమే. కోవిడ్ దృష్ట్యా చాలామంది పోలింగ్ బూత్‌ల వద్ద నిరీక్షించేందుకు వెనుకంజ వేస్తే ఈ సారి కూడా పోలింగ్ శాతం తగ్గే అవకాశం ఉంటుంది. కానీ హైదరాబాద్ నగర అభివృద్ధి దృష్ట్యా ఈ ఎన్నికలు ఎంతో కీలకమైనవి. ఆ బాధ్యతను దృష్టిలో ఉంచుకొని ప్రతి వ్యక్తి ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఉత్తమ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి. -
తొలిసారి ఓటు వేయడం కోసం..
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికలు రెండో దశ పోలింగ్ నేడు ప్రారంభం అయ్యింది. 17 జిల్లాలోని 94 అసెంబ్లీ నియోజకవర్గాలకు నేడు ఓటింగ్ జరుగుతుంది. ఈ క్రమంలో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన ఓ యువతి పలువురు దృష్టిని ఆకర్షించింది. ఓటు వేయడం కోసం సదరు యువతి సైకిల్ మీద తన బామ్మతో కలిసి పట్నా పోలింగ్ కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘ఓటు హక్కు వచ్చిన తర్వాత మొదటిసారి దాన్ని వినియోగించుకున్నాను. మా బామ్మతో కలిసి ఓటు వేయడానికి వచ్చాను. భవిష్యత్తులో యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తారని ఆశిస్తున్నాను’ అని తెలిపింది. (చదవండి: నితీష్‌కు ఇదే చివరి ఎన్నిక : చిరాగ్) బిహార్ రెండో దశ అసెంబ్లీ పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. 17 జిల్లాల్లో విస్తరించి ఉన్న 94 అసెంబ్లీ స్థానాలకు నేడు (మంగళవారం) పోలింగ్ జరుగుతోంది. 94 స్థానాలకు 1,463 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. భద్రత దృష్ట్యా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుంది. నేటి పోలింగ్‌లో 2.85 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వృద్ధులు, కోవిడ్ లక్షణాలున్నవారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్య చర్యలను పాటిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం పోలింగ్ జరుగుతోంది. -
అంతరిక్షం నుంచి అధ్యక్షుడికి ఓటు
ఓటు వేయడం అంటే మనకేం కావాలో అడగడం మాత్రమే కాదు.. ఏం వద్దో కూడా చెప్పడం. అసలు ఓటే వేయకపోతే? ఏమైనా చేసుకొమ్మని హక్కులన్నీ రాసివ్వడం! ఓటు హక్కుని కూడా!! మహిళల్నైతే అస్సలు.. మిస్సవద్దని అంటారు కేట్ రూబిన్స్. తనైతే అంతరిక్షం నుంచే ఓటు వేయబోతున్నారు. మహిళలే మార్పు కోసం ముందుంటారు. మహిళలే మార్పు కోసం ముందుగా ఉద్యమిస్తారు. ఎందుకంటే మహిళలకే తమ స్థితిగతుల్ని మార్చుకోవలసిన అవసరాన్ని సమాజం ఎప్పుడూ కలిగిస్తూ ఉంటుంది. ‘సమాజం’ అని ఎక్కడో దూరాన్నుంచి చెప్పడం ఎందుకు గానీ, పురుషులు మారనందువల్లనే సమాజాన్ని మార్చే ప్రయత్నాలు మహిళలకు అవసరం అవుతుంటాయి. ఇంత ఉపోద్ఘాతాన్ని ఒక్కమాటలో కూడా చెప్పొచ్చు. ట్రంప్ ఉన్నారు. ఆయన్ని మార్చేయాలి. మనిషిని మార్చడం కాదు. అధ్యక్ష పదవి నుంచి మార్చేయాలి. మహిళలందరూ కలిస్తే ఆయన్ని మార్చడం సాధ్యం కావచ్చు. ఒకవేళ ఆయనకు వ్యతిరేకంగా అందరూ కలిసి రాకపోతే! రాకపోయినా అదేమీ మార్పు కోసం ఏ ప్రయత్నమూ జరగకుండా పోయినట్లు కాదు. ఎవరి వంతు ప్రయత్నాలతో వారే కదా ఇంతవరకు మహిళలు ఒకటవుతూ మార్పును సాధించుకుంటూ వచ్చారు. చదవండి: (తొలిసారిగా అంతరిక్షంలో డీఎన్ఏ అమరిక) అమెరికన్ ఆస్ట్రోనాట్ కేట్ రూబిన్స్ తను ట్రంప్‌కి వ్యతిరేకమో అనుకూలమో చెప్పడం లేదు. అయితే తప్పక ఆమె తన ఓటును నవంబర్ 3 న జరిగే అధ్యక్ష ఎన్నికలో వేయబోతున్నారు. ‘ఇటీజ్ క్రిటికల్ టు పార్టిసిపేట్ ఇన్ ది డెమోక్రసీ’ అంటున్నారు. ప్రజాస్వామ్యంలో భాగస్వాములం అవడానికి ఓటు వేయడం అత్యవసరం’ అని. ముఖ్యంగా మహిళలు తమ ఓటును మిస్ చేసుకోకూడదని కేట్ చెబుతున్నారు. ఓటర్ల జాబితాలో పేరుండీ ఓటు వేయడాన్ని మహిళలు తరచు మిస్ చేసుకోడానికి కారణం రాజకీయాల్లో వాళ్లకు ఆసక్తి లేకపోవడం అనుకోకండి. ‘మిస్’ చేసుకోవడం అంటే ఇక్కడి అర్థం.. భర్త చెప్పినట్లో, ఇంకొకరు చెప్పినట్లో ఫలానా అభ్యర్థికి ఓటేయడం. కేట్ రూబిన్స్కి ట్రంప్‌కి ఓటెయ్యాలని లేదనుకోండి. ఆమె భర్త మైఖేల్ మేగ్నాని ఆమెను ట్రంప్‌కే ఓటెయ్యమని చెప్పాడనుకోండి. అతడు చెప్పినట్లు కేట్ ట్రంప్‌కే ఓటేశారనుకోండి. అప్పుడు ఆమె తన ఓటును మిస్ అయినట్లు. ‘‘ఓటు వేయకుండా ఉండకూడదు, నచ్చిన వ్యక్తికి వేయకుండానూ ఉండకూడదు’’ అని కేట్ తరచు మహిళల్ని ప్రోత్సాహ పరుస్తుంటారు. ఈసారి కూడా ఎన్నికల సమయానికి ఆమె భూమి మీద ఉండబోవడం లేదు. అక్టోబర్ మధ్యలో అంతరిక్షంలోకి వెళ్తున్నారు. మళ్లీ తిరిగి రావడం వచ్చే ఏడాది ఏప్రిల్‌లోనే. అధ్యక్ష ఎన్నికలకు అంతరిక్షం నుంచే ఎలక్ట్రానిక్ బ్యాలెట్ ద్వారా ఆమె ఓటేస్తారు. ఆమె ఒక్క ఓటు కౌంట్ కాకపోతే అధ్యక్ష అభ్యర్థులకు వచ్చేది, పోయేది లేకపోవచ్చు. అయితే ఆమె ఒక్క ఓటూ అధ్యక్షుడు ట్రంపా, బైడనా అనే హోరాహోరీ పోటీలో ఒక సంఖ్యలో భాగంగానైతే ఉంటుంది. ఆ భాగాన్నే.. ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం కావడం అంటారు కేట్ రూబిన్స్. స్పేస్‌లోకి వెళ్లినప్పుడు ‘క్రూ’లో ఒకరైన వ్యోమగామి జెఫ్ విలియమ్స్‌తో నాసా స్పేస్ సూట్స్ మధ్య కేట్ రూబిన్స్. గత అమెరికా అధ్యక్ష ఎన్నికలకు కూడా అంతరిక్షం నుంచే ఓటు వేశారు కేట్. ఆ ఏడాది నవంబర్ 8 న అధ్యక్ష ఎన్నికలు జరిగే నాటికి వారం ముందే కేట్ భూమి మీదకు తిరిగి వచ్చేసినప్పటికీ ‘ఎర్లీ ఓటింగ్’ సదుపాయంతో ముందే స్పేస్ నుంచి ఓటేశారు. ప్రస్తుతం ఈ ఆస్ట్రోనాట్ తన రెండో అంతరిక్షయానానికి సన్నద్ధం అయేందుకు మాస్కోలోని స్టార్ సిటీలో అక్కడ మరో ఇద్దరు పురుష కాస్మోనాట్స్‌తో కలిసి శిక్షణ పొందుతున్నారు. (ఆస్ట్రోనాట్ అన్నా, కాస్మోనాట్ అన్నా ‘వ్యోమగామి’ అనే అర్థం. అమెరికా ఆస్ట్రోనాట్ అంటుంది. రష్యా కాస్మోనాట్ అంటుంది). సూయెజ్ ఎం.ఎస్.–17 అనే వ్యోమనౌకలో రష్యాలోని బైకనూర్ కాస్మోడ్రోమ్ నుంచి ఈ ముగ్గురూ అంతరిక్ష కేంద్రంలోకి బయల్దేరుతారు. ముగ్గురిలో ఒకరు కమాండర్. ఇద్దరు ఫ్లయిట్ ఇంజనీర్లు. కేట్ ఇంజనీర్ నెం.2. అంతరిక్ష కేంద్రంలోని (ఐ.ఎస్.ఎస్.) ‘కోల్డ్ ఆటమ్ ల్యాబ్’లో వ్యోమగాముల హృదయనాళాలపై అంతరిక్ష వాతావరణ పీడన ప్రభావాల మీద కేట్ ఆరు నెలల పాటు పరిశోధనలు జరుపుతారు. ఆమె అక్కడ ఉన్నప్పుడే... ఐ.ఎస్.ఎస్. విరామం లేకుండా మనుషులతో సందడిగా ఉండి ఇరవై ఏళ్లు పూర్తయిన సందర్భం వస్తుంది! ఆమె అక్కడ ఉన్నప్పుడే ప్రైవేటు అంతరిక్ష సంస్థ ‘స్పేస్ ఎక్స్’ రెండో విడత వ్యోమగాములకు స్వాగతం పలుకుతారు. ఆమె అక్కడ ఉన్నప్పుడే భూమి మీద అమెరికా కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారాన్ని పై నుంచి వీక్షిస్తారు. ఆమె ఓటు వేసిన అభ్యర్థి ఎన్నికయ్యారా, ఓటు వేయని అభ్యర్థి ఎన్నికయ్యారా అన్నది ఆమెకు తెలుస్తుంది. ఆమెకు మాత్రమే తెలుస్తుంది. స్పేస్‌లో 60వ మహిళ కేట్ పూర్తి పేరు కేథ్లీన్ హ్యాలసీ కేట్ రూబిన్స్. నాసా వ్యోమగామి. కేట్ పుట్టింది కాలిఫోర్నియాలో. ఉంటున్నది టెక్సాస్‌లో. ఏడో తరగతి చదువుతున్నప్పుడే స్పేస్ క్యాంప్‌కు వెళ్లడానికి అవసరమైన డబ్బుల కోసం ఇంటి చుట్టుపక్కల పనీ పాటా చేసి, ఆ మేరకు సంపాదించుకున్నారు. స్పేస్ క్యాంప్ అంటే ఏం లేదు. అలబామాలో నాసా వాళ్ల అంతరిక్ష మ్యూజియం ఉంటుంది. అందులోని వింతలు–విశేషాలు చూసేందుకు వెళ్లే పిల్లల ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్. కేట్ (41) తన ముప్పయవ యేట నాసాలో ప్రవేశించారు. 2016లో స్పేస్‌లోకి అరవయ్యవ మహిళగా (ప్రపంచం మొత్తం మీద) అడుగు పెట్టారు. కేట్ తర్వాత మరో ఐదుగురు మహిళలు ఐ.ఎస్.ఎస్.ను చేరుకున్నారు. -
పోలింగ్‌లో పాల్గొన్న కరోనా సోకిన ఎమ్మెల్యే
భోపాల్ : కరోనా వైరస్ ఆయనను ఓటు వేయకుండా ఆపలేకపోయింది. పీపీఈ కిట్ ధరించి మరీ రాజ్యసభ ఎన్నికల ఓటింగ్‌లో పాల్గొన్నారు ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే. శుక్రవారం 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. భోపాల్‌లోని మూడు రాజ్యసభ ఎన్నికలకు జరిగిన పోలింగ్‌లో కరోనా సోకిన ఎమ్మెల్యే కునాల్ చౌదరి పీపీపీ కిట్ ధరించి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అప్పటికే మిగతా ఎమ్మెల్యేలు ఓటు వేయగా, కునాల్ చివర్లో ఓటు వేశారు. మధ్యాహ్నం 12.45 గంటలకు అంబులెన్సులో విధానసభకు చేరుకున్న ఎమ్మెల్యే కునాల్ పీపీఈ కిట్ ధరించి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 'మిగతా సభ్యులు నా దరిదాపుల్లోకి కూడా రాలేదు. వాళ్లు భయపడటం సహజమే కానీ నేను పీపీపీ కిట్ ధరించి పూర్తి జాగ్రత్తలు పాటించి మా పార్టీ అభ్యర్థికి ఓటు వేసి వచ్చాను' అని ఎమ్మెల్యే కునాల్ తెలిపారు. (ముందస్తు ప్రణాళికతోనే చైనా దాడి: రాహుల్ గాంధీ ) Madhya Pradesh: A Congress MLA who had tested positive for #COVID19, arrives at the state legislative assembly in Bhopal to cast his vote. Voting is currently underway for three Rajya Sabha seats of the state. #RajyaSabhaElection pic.twitter.com/P8wltUu8fT — ANI (@ANI) June 19, 2020 కరోనా సోకిన ఎమ్మెల్యే పోలింగ్‌లో పాల్గొనడం ఇదే ప్రథమం. దీనిపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. వైరస్ సోకినా బాధ్యతాయుతమైన పౌరుడిలా ఓటు హక్కును వినియోగించుకున్నారు అని కాంగ్రెస్ నేతలు పేర్కొనగా, అసలు కరోనా సోకిన వ్యక్తిని లోపలికి ఎలా అనుమతించారంటూ బీజేపీ నేతలు వాదిస్తున్నారు. క్వారంటైన్లో ఉండాల్సిన వ్యక్తి ఓటు వేయడానికి ఎన్నికల సంఘం ఎలా అనుమతించిందని బీజేపీ నాయకుడు హితేష్ బాజ్‌పాయ్ ప్రశ్నించారు. ఇది అంటువ్యాధి నియంత్రణ నిబంధనల ఉల్లంఘన కిందికే వస్తుందని ట్వీట్ చేశారు. ఈనెల 12న కాంగ్రెస్ ఎమ్మెల్యే కునాల్ చౌదరికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. మార్చి నెలలోనే రాజ్యసభ ఎన్నికలు జరగాల్సి ఉండగా, కరోనా కారణంగా ఎన్నికల సంఘం వాయిదా వేసింది. అయితే గత కొన్ని వారాలుగా దాదాపు 10 రాష్ట్రాల్లో రాజీనామాలు, రిసార్ట్ రాజకీయాలు లాంటి ఆరోపణలు తలెత్తుతున్న నేపథ్యంలో 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల సంఘం పోలింగ్ నిర్వహించింది. (ప్రైవేట్ ఆస్పత్రుల ఫీ‘జులుం’ చెల్లదు.. ) -
ఓటు హక్కు బలమైన ఆయుధం: గవర్నర్
సాక్షి, విజయవాడ: సమాజంలో ఓటు హక్కు ఒక బలమైన ఆయుధమని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. అర్హత ఉన్నవారంతా ఓటర్లుగా నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. 10వ జాతీయ ఓటర్ల దినోత్సం సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన కార్యాక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు. నూతనంగా ఓటు హక్కు పొందినవారికి ఆయన ఓటరు కార్డులు అందచేశారు. అలాగే 2019 సార్వత్నిక ఎన్నికల నిర్వహణలో ఉత్తమ ప్రతిభ చూపిన 13 జిల్లాలకు చెందిన అధికారులకు అవార్డులు అందచేశారు. ‘రాజ్యాంగంలో ఆర్టికల్ 14 అందరికీ సమాన హక్కుల గురించి తెలుపుతుంది. ఓటు హక్కు ఉన్నా వినియోగించుకోకపోతే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు కోల్పోతారు. మీరు ఓటు వేసి మీ స్నేహితులకు కూడా అవగాహన కల్పించి ఓటు వేయించండి’ అని గవర్నర్ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ మాట్లాడుతూ... ‘కొన్ని సంవత్సరాల క్రితం సామాన్య మనిషికి తన హక్కులు పొందే వ్యవస్థ లేదు. ప్రజా పోరాటాల ఫలితంగా హక్కులు వచ్చాయి. వందేళ్ల పెనుమార్పుల ఫలితంగా ఈ వ్యవస్థ ఏర్పడింది. 28 దేశాలలో ఓటు వేయడం హక్కుగానే కాక ఓటు వేయకుంటే పెనాల్టీ వేసే విధానం ఉంది. ప్రపంచవ్యాప్తంగా పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ మనది. మన ఎన్నికల ప్రక్రియ నిర్వహణలో అన్ని దేశాల కంటే మెరుగైనది. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలనే నిబద్ధతతో ఉండాలి. పట్టణాలలో గ్రామీణ ప్రాంతాల కన్నా ఓటు హక్కును తక్కువ శాతం వినియోగించుకుంటున్నారు. ముందు తరాలకు మనం ఇచ్చే వారసత్వపు హక్కు ఓటు హక్కు’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీజీ డాక్టర్ రవిశంకర్, జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ పాల్గొన్నారు. -
అయిదో విడుతలో ఓటు వేసిన ప్రముఖులు
-
ఓటు హక్కును వినియోగించుకున్న ధోని
-
నాలుగో విడుతలో ఓటు వేసిన ప్రముఖులు
-
ఓటెత్తిన ప్రముఖులు
-
ఒక్క ఓటు కోసం ఆరుగురు సిబ్బంది
సాక్షి, న్యూఢిల్లీ : సమయం ఉదయం 9.30 గంటలు. గురువారం. అది అరుణాచల్ ప్రదేశ్‌లోని మలోగామ్ గ్రామం. అప్పటికే నూటికి నూరు శాతం పోలింగ్ పూర్తయింది. అదెలా అంటూ ఆశ్చర్య పోనవసరం లేదు. సొకేలా తయాంగ్ అనే 39 ఏళ్ల ఏకైక మహిళా ఒటరు వచ్చి పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలకు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. టిబెట్‌కు సరిహద్దు కొండల్లో ఉన్న అడవిలో మలోగామ్ ఉంది. 2011లో నిర్వహించిన సెన్సెస్ ప్రకారం ఆ గ్రామంలో ఓ ఇల్లు ఐదుగురు కుటుంబ సభ్యులు నివసిస్తున్నారు. వారిలో సొకేలా తయాంగ్ ఒక్కరే ఓటరుగా నమోదు చేయించుకున్నారు. ఆ ఒక్క ఓటు కోసం ప్రిసైడింగ్ అధికారి గమ్మర్ బామ్(34) తన నలుగురు సిబ్బంది, ఓ సిక్యూరిటీ గార్డు, ఓ జర్నలిస్ట్‌తో కలిసి బుధవారం ఉదయం బస్సులో మలోగామ్ బయల్దేరారు. అటవి ప్రాంతానికి వెళ్లాక అక్కడి నుంచి కాలి నడకన వెళ్లాల్సి వచ్చింది. సాధారణంగా సమీపంలోని ప్రభుత్వ అధికారిని ప్రిసైడింగ్ అధికారిగా నియమిస్తారు. ఇక్కడ ప్రిసైడింగ్ అధికారిగా, ఎన్నికల సిబ్బందిగా పర్వతారోహకులుగా కొండలెక్కే అలవాటు ఉన్న వాళ్లను ఎంపిక చేశారు. అంతేకాకుండా ఆ ఏకైక ఓటరుకు పోలింగ్ షెడ్యూల్ తెలియజేయడానికి ప్రత్యేకంగా సొకేలా తయాంగ్ వద్దకు ఓ కొరియర్‌ను పంపించారు. కొండ ప్రాంతానికి చేరుకున్న ఎన్నికల సిబ్బంది గురువారం ఉదయమే రేకులతో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయగా, 9.30 గంటల ప్రాంతంలో సొకేలా తయాంగ్ పచ్చి తన ఓటింగ్ హక్కును వినియోగించుకున్నారు. అయితే ఈ విషయాన్ని పై అధికారులకు తెలియజేయాలంటే సిగ్నల్స్ లేక టెలిఫోన్లు పనిచేయలేదు. చివరకు ఆ రోజు సాయంత్రానికల్లా పోలీసుల ద్వారా హవాయ్ అసిస్టెంట్ పోలింగ్ అధికారి సోడె పోటమ్‌కు తెలియజేశారు. ఒక్క ఓటు కోసం ఎంత ఖర్చు పెట్టాల్సి వచ్చిందని పోటమ్‌ను మీడియా ప్రశ్నించగా ఖర్చు ఎంత అన్నది ఇక్కడ ముఖ్యం కాదని, ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రకారం ఓటు హక్కు వినియోగించుకునే హక్కు కల్పించామా, లేదా? అన్నదే ముఖ్యమని ఆయన అన్నారు. ఈ పోలింగ్ బూతుకు ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించిన గమ్మర్ బామ్, ఆరుణాచల్ విద్యుత్ శాఖలో జూనియర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. ఆయన ఈ ఒక్క ఓటు కోసం తనతో కలిసి ఐదుగురు పోలింగ్ సిబ్బంది, ఓ జర్నలిస్ట్, ఓ పోలీసు అధికారిని తీసుకొని రావాల్సి వచ్చింది. 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో సొకేలా తయాంగ్, తన భర్త జనేలం తయాంగ్‌తో కలిసి రెండు ఓట్లు వేశారు. అయితే ఆ తర్వాత ఆమె భర్త తన ఓటు హక్కును మరో చోటుకు బదిలీ చేయించుకోవడంతో ఈసారి ఆమె ఒక్కరే ఓటు వేయాల్సి వచ్చింది. -
ఓటు వేసిన వైఎస్ విజయమ్మ
-
ఓటు హక్కును వినియోగించుకున్న వైఎస్ భారతి
-
ఈసీ ఓటు చాలెంజ్..!
సాక్షి, హుస్నాబాద్ రూరల్: పోలింగ్ కేంద్రాలకు వచ్చిన ఓటర్లను గుర్తించేందుకు గుర్తింపు పత్రాలు అవసరం. ఎన్నికల కమిషన్ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లు ఫొటో గుర్తింపు కార్డులు చూపించాల్సి ఉంటుంది. ఓటరు జాబితాలో పేర్లు తప్పుగా ఉండటం వల్ల ఓటు వేసేందుకు వచ్చిన వ్యక్తిని ఓటు వేయకుండా ఆయా పార్టీల ఎలక్షన్ ఏజెంట్లు అభ్యంతరం చెప్తే ఓటు వేసేందుకు ఓటరు చాలెంజ్ చేసే అవకాశం ఉంది. ఎవరి గుర్తింపునైనా ఏజెంట్లు చాలెంజ్ చేయాలనుకుంటే ప్రిసైడింగ్ అధికారి వద్ద రెండు రూపాయలు జమ చేయాలి. వారు సవాల్ చేసిన ఓటరు గుర్తింపు విషయంలో విచారణ జరపాల్సి ఉంటుంది. విచారణ తర్వాత వ్యక్తి గుర్తింపు నిర్ధారణ అయినట్టు సంతృప్తి చెందితే అతడిని ఓటు వేయనీయవచ్చు. ఓటరు జాబితలో పేర్లు తప్పుగా ఉంటే ఓటు వేసేందుకు ఇతర రాజకీయ పార్టీల ఎలక్షన్ ఏజెంట్లు అభ్యంతరాలు చెప్తే, ఓటరు ‘చాలెంజ్ ఓటు’ హక్కును ఉపయోగించుకోవచ్చు. బోగస్ ఓటు అని తేలితే.. ఓటరు జాబితాలో పేరు ఉన్న ఓటరు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చినప్పుడు అతని ఓటును ఇతరులు ఏవరైనా వేసినప్పుడు అక్కడ ఎలక్షన్ ఏజెంట్లు అభ్యంతరాలు చెప్పుతారు. అప్పుడు ఓటరు నేనే నిజమైన ఓటరును అని నిరూపించుకొనేందుకు చాలెంజ్ ఓటును ఎలక్షన్ కమిషన్ కల్పించింది. – కె.అనంత్‌రెడ్డి, ఆర్డీవో దీనికి ఛాలెంజ్ చేసిన వ్యక్తి ప్రిసైడింగ్ అధికారి వద్ద రెండు రూపాయల రుసుం చెల్లించి విచారణ అనంతరం ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. విచారణలో ఓటరు బోగస్ అని తేలితే చట్టరీత్య చర్యలు తీసుకుంటారు. ఓటరుపై విచారణ ఇలా.. బోగస్ ఓటరుపై సవాల్ చేసిన ఏజెంటు ఆ వ్యక్తిని అనుమానిస్తున్నందుకు రుజువులు చూపించాల్సి ఉంటుంది. తమ సవాల్‌ను సమర్థిస్తూ నిరూపణలు చూపలేని పక్షంలో సవాల్‌ను నిరాకరించవచ్చు. పోలింగ్ ఏజెంటు బోగస్ ఓటరుకు సాక్షాలను నిరూపిస్తే అతను ఓటరు కాదని నిర్ధారించిన తర్వాత ఓటరుకు నిరూపించుకొనే అవకాశం ఇవ్వాలి. దీనికి తాను ఓటరునని గుర్తింపును చూపిస్తే అతనిని ఓటు వేయనీయవచ్చు. అలా కాని పక్షంలో గ్రామ అధికారి ద్వారా లేదా ఇతర అధికారుల చేత గుర్తించవచ్చు. విచారణలో బోగసు ఓటరు అని తేలితే అక్కడే ఉండే పోలీసులకు అతనిని అప్పగించాల్సి ఉంటుంది. ఓటరు నిర్ధారణ జరిగితే ఓటు వేయనిస్తారు. -
‘సీ విజిల్ యాప్‌ను వినియోగించాలి’
సాక్షి, జోగిపేట(అందోల్): ఎన్నికల అక్రమాలపై ఫిర్యాదులు చేసేందుకు సీ విజిల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని జెడ్పీ సీఈవో రవి సూచించారు. శుక్రవారం పట్టణలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్నికల అధికారులకు నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు యువత ఈ విషయంలో స్పందించాలని కోరారు. పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి 13 నుంచి సీ విజిల్ అందుబాటులోకి ఎన్నికల కమిషన్ తెచ్చినట్లు తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు కోసం ప్రతీ నియోజకవర్గం పరిధిలో 24 గంటలు పనిచేసే విధంగా నిఘా బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సీ విజిల్ ఫిర్యాదులపై తీసుకున్న చర్యలకు సంబంధించి ఫిర్యాదుదారులకు 100 నిమిషాల్లో సమాచారం పంపే విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. 18 సంవత్సరాలు నిండిన, యువతీ యువకులు తమ ఓటు హక్కును నమోదు చేసుకొని ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. పోలింగ్ స్టేషన్ల వద్ద ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ సమావేశంలో నోడల్ అధికారి బాబూ నాయక్ తహసీల్దారు బాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘ఓటు’తో తేలుస్తా.. ఎనీ డౌట్స్!
ఎన్నికల క్రతువును ప్రకటించిన ఎలక్షన్ కమిషన్, షెడ్యూల్ ఖరారు చేయడంతో సమర శంఖం పూరించినట్టయింది. మన రాష్ట్రానికి సంబంధించినంత వరకు.. నెల రోజుల్లో అసలు యుద్ధం జరగబోతోంది. ఈ మాసం వ్యవధిలో ప్రచారాలు, విమర్శలు, ఆగ్రహావేశాల సంగతి అటుంచితే.. నాయకులంతా ఓటరు దేవుడిని ప్రసన్నం చేసుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. ఈ నేపథ్యంలో ఆ ఓటరు మహాశయుడి అంతరంగం ఎలా ఉందో.. అతనిలో అసలు మనిషి ఏమంటూ ఉంటాడో నాడి పట్టి చూపేందుకు సరదాగా చేసిన ప్రయత్నమిది. సాక్షి, విశాఖపట్నం: ప్రతీ ఒక్కరికీ ఒక రోజు ఉంటుందంటాడు ఇంగ్లీషోడు. వాడనే పద్ధతి వేరేలే! అయితేనేం.. ఓ రోజుండకపోదుగా! అలా.. ఇన్నాళ్లకు.. ఐదేళ్లకు.. నాకూ వచ్చిందొక రోజు... సారీ.. ఒక నెల.. కచ్చితంగా చెప్పాలంటే.. ముప్పయి దినాలు. హమ్మయ్య.. ఎన్నాళ్లకెన్నాళ్లకెన్నాళ్లకూ.. అని ఎన్టీవోడి సినిమాలోలా పాడబుద్ధవుతుందిలే కానీ ఎక్స్ట్రాలెక్కువంటారని ఊరుకున్నా. ఎక్స్ట్రాలంటే గుర్తొచ్చింది కదా.. గడిచిన దాదాపు అయిదేళ్ల కాలంలో నాయకులమని, ఆమాత్యులమని, ప్రజా ప్రతినిధులమని.. ఎన్నెన్ని ఎక్స్‌ట్రాలు చేశారబ్బా మీరు! ఈ బక్కచిక్కిన, డొక్కెండిన, దిక్కులేని, తల దాచుకునే గూడు లేని, సమస్యలతో సతమతమయ్యే, ఇబ్బందులతో అతలాకుతలమయ్యే.. బడుగు జీవిని ఎంతలా ఆడుకున్నారు మీరు! చదువుకు సీటు దొరక్క.. చేయాలంటే ఉద్యోగం లేక, ఆడపిల్లకు రక్షణ లేక, బడుగు జీవికి ఉపాధి లేక.. బాధల, కత్తుల వంతెన మీద నడుస్తూ.. కన్నీరు, నెత్తురు కారుస్తూ.. ప్రతీ రోజొక అగ్ని పరీక్షలా.. ప్రతీ దినమొక కఠిన శిక్షలా.. మేం సామాన్యులం కాలం గడిపితే.. ‘మీరెంతరా’ అన్నట్టు కూరలో కరేపాకులా తీసి పడేశారు కదయ్యా మీరు! తస్సాదియ్యా.. ఇప్పుడొచ్చింది మాకూ ఓ రోజు.. ఏప్రిల్ రెండొకట్ల రోజు! ఏప్రిల్ 1 అంటేనే ఆల్ ఫూల్స్ డే అయితే.. రెండొకట్లు రెట్టింపు ఫూల్స్ డే కదా.. చూడండర్రా ఆ రోజు తిప్పుతా చక్రం.. ఓటు సుదర్శన చక్రం.. ఎందరిని ఒకేసారి ఫూల్స్ చేస్తానో చూడండర్రా! ఓటేసిన రోజునే మేం ప్రభువులమని ఎగతాళి చేస్తూ ‘ఏక్ దిన్కా సుల్తాన్’ అంటారు మీరు వెటకారంగా మమ్మల్ని. ఆ పేరున హాస్య బ్రహ్మ జంధ్యాల రాసిన నాటిక చూశారా? ఆ ఒక్క రోజు రాజే అందరినీ గడగడలాడించేస్తాడు చూశారా? ఇద్గో.. ఇలా ఉంటాది నా ప్రతాపం. కాసుకోండి.. లెక్కేసుకోండి! అయిదేళ్లూ పడ్డదానికి లెక్క అప్పజెబుతాలే! మన గురజాడ గురువుగారు అన్నారు కదా.. తాంబూలాలిచ్చేశాను.. అని! ఎలక్షన్ కమిషన్ వోడు తాంబూలాలిచ్చేశాడు.. ఇక మీరూ మీరూ తన్నుకోండి. ఏదైనా నాకు వినోదం ఉండాలి సుమా! దారి తప్పారో.. తాట తీస్తా! మనం మర్యాదస్తులం. మర్యాదగా ఉండండి. శ్రుతి మించిపోకండి. మీ అందరి మీదా ఓటరు బాబు.. అంటే నేనే.. ఓ కన్నేసి ఉంటాడని మరిసిపోకండి. ఆడ కూతుళ్ల గౌరవం కాపాడండి. ఇది లగ్నాల సమయం. అదే.. పెళ్లిళ్ల కాలం. పెద్దోళ్లు జాతకాలు చూసి మరీ యోగ్యుడిని తెచ్చి తాళి కట్టిస్తారు. నేను మీ అందరికీ పెద్దను కదా! జాగ్రత్తగా మీ తీరుతెన్నులు.. గత చరిత్రలు చూసి మరీ పదవీ వధువును అప్పజెబుతా. జాతకాలు తిన్నంగా లేకపోతే సరి జేస్తా. అందరి లగ్నాల్లో అధిపతి ఒక్కో రాశికీ ఒక్కో రకంగా ఉండొచ్చు గాక.. మీ లగ్నాధిపతి మాత్రం నేనే. అది గుర్తెట్టుకోండి! నన్ను మంచిగా.. ఈ ముప్పయి రోజులే కాదు.. ఆపైన కూడా చూసుకోవాల. మంచిగా చూసుకోవడమంటే మటన్ బిర్యానీ పేకెట్లో.. మందు బాటిళ్లో, మనీ కానుకలో ఇవ్వడం కాదొరేయ్! మందికి.. అంటే మనందరికీ మేలు చేయాల! నాది విశ్వరూపం. నాలో కార్మికుడు, కర్షకుడు, శ్రామికుడు, యువకుడు, ఉద్యోగి, అక్కచెల్లెమ్మలు, అవ్వతాతలు.. అందరూ ఉన్నారు. అందరి బాగుకూ పూచీ పడాల! అప్పుడే.. ఈ ముగాంబో ఖుష్ అవుతాడు! విశ్వరూపానికి కోపం తెప్పించారో.. మాడి మసైపోతారోయ్! ఓటరు ఓటరనుచూ.. సామాన్యుడినని అశ్రద్ధ చేయుచూ.. అవహేళన చేయుచూ.. అయిదేళ్లు అధికార అహంకారముతో మీరే సామ్రాట్టులని విర్రవీగిన మీది ఎంత అవివేకమెంత అజ్ఞానము! నేటి నుంచి ముప్పది రోజుల పాటు మా ఎడల భక్తి ప్రపత్తులతో.. గౌరవ మర్యాదలతో మెలగుటయే కాక.. రాబోవు కాలమంతటికీ మేమే రాజులమని పరిగణించి.. మా ఎడల నిరుపమాన ఆదరాభిమానములతో.. ఆప్యాయతానురాగములతో.. మెలగుదమని.. మా ఆకాంక్షలకు.. అవసరాలకు అనుగుణంగా.. జాగ్రత్తగా, జన రంజకముగా పరిపాలింతురని.. సంక్షమమునకు పెద్ద పీట వేసి.. స్వార్థమును త్యజించి.. శాసనములు రూపొందింతురని.. ప్రజలందరి సాక్షిగా ప్రమాణము చేసి తదనుగుణముగా నడచుకుందురేని.. మీరే మా హృదయాధినేతలు. కాదని విర్రవీగితిరేని.. భీషణ హుతాసనకీలా సమాన నిశిత కరవాలమును పోలు ‘ఓటు’ అస్త్ర శస్త్ర ప్రయోగముతో మీ రాజకీయమ్మన్యుల భవితవ్యమును చిందరవందర గావించెద.. మీకు రేపను మాట లేకుండా శంకరగిరి మాన్యములు పట్టించెద. ఇదే నా శపథం. ఎనీ డౌట్స్? – బి.ఎస్.రామచంద్రరావు -
‘ఫేటు’ మార్చే ఓటు..!
సాక్షి, విశాఖపట్నం: ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ఎన్నికల్లో ప్రతి ఓటూ కీలకమైనదే.. గెలుపు ఓటములను శాసించేదే.. ఒక్క ఓటు చాలు.. అభ్యర్థుల తలరాతలను తారుమారు చేయడానికి.. ఆ ఒక్క ఓటు నీదే కావచ్చు..!.. అభ్యర్థి విజయాన్ని నీ ఓటే నిర్దేశించవచ్చు.. నీకు ఓటు హక్కు ఉంటేనే.. ఆ హక్కును వినియోగించుకుంటేనే.. నీ భావి పాలకులను నిర్దేశించే స్థితిలో ఉంటావు.. అసలు ఉంటే ఎంత.. లేకపోతే ఎంత.. అని నిర్లిప్తత వహిస్తే.. రాజ్యాంగం ప్రసాదించిన హక్కును నీకు నీవే కాలరాసుకున్నవాడివవుతావు.. ప్రజాప్రతినిధులను ప్రశ్నించే నైతిక అర్హత కోల్పోతావు.. కానీ దురదృష్టవశాత్తు ఆ నిర్లక్ష్యమే మన ఘన ప్రజాస్వామ్య స్ఫూర్తిని వెక్కిరిస్తోంది. ఓటరుగా చేరడం, ఓటు హక్కు వినియోగించుకోవడంలో విద్యావంతులే అనాసక్తత ప్రదర్శిస్తుండటంతో సగం ఓట్లు కూడా పొందనివారు ప్రజాప్రతినిధులుగా ఎన్నికైపోతున్నారు. అధికార మదంతో విర్రవీగుతున్నారు. జనాభాలో ఓటుహక్కు పొందే వయసు వచ్చినా వేలాదిమంది దానిపై ధ్యాస చూపడం లేదు. జనాభా, ఓటర్ల సంఖ్య మధ్య కనిపించే భారీ వ్యత్యాసమే దీనికి నిదర్శనం. తాజా గణాంకాల ప్రకారం.. ఓటు హక్కు వచ్చే 18–29 ఏళ్ల మధ్య వయసున్న వారిలో 3,97,224 మంది ఇంకా ఓటర్లు చేరనేలేదంటే నిర్లిప్తత ఎంతగా పేరుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితి ఇకనైనా మారాలి.. వచ్చే నెలలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయాలని అందరూ శపథం పూనాలి. సరైన ప్రజాప్రతినిధులను ఎన్నుకునేందుకు కంకణబద్ధులు కావాలి.. అయితే దానికి ఎంతో సమయం లేదు.. మిగిలింది నాలుగు రోజులే.. ఈ నెల 15 వరకే కొత్త ఓటర్ల నమోదుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. అందుకే యువతా మేలుకో.. ఓటు ఉత్సాహం ఉరకలెయ్.. ఓటరు జాబితాలను ముంచెత్తు.. భావి నేతల ఎన్నికలో క్రియాశీల పాత్ర పోషించు..! -
ఓడిపోతున్న ఓటు
హైదరాబాద్: మెట్రో నగరాల్లో ఓటరు చైతన్యం కొడిగడుతోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం వివిధ మెట్రో నగరాల్లో నివసిస్తున్నవారు కనీసం తమ ఓటు హక్కు నమోదు చేసుకోవడానికి కూడా బద్దకిస్తున్నారు. నెట్స్‌అవే సంస్థ ప్రత్యేకంగా ప్రశ్నావళి రూపొందించి ఢిల్లీ, ముంబై, పుణే, బెంగళూరు, హైదరాబాద్ నగరాలకు చెందిన యువతీయువకుల అభిప్రాయాలను ఆన్లైన్ మాధ్యమం ద్వారా సేకరించింది. ఆ వివరాల్లోకెళ్తే.. 53 శాతమే అత్యధికం.. ఓటు చైతన్యంలో బెంగళూరు ముందంజలో నిలిచింది. ఈ సిటీలో ఓటరు నమోదు, ఐడీ కార్డులను పొందడంతోపాటు క్రమం తప్పకుండా ఓటు వేస్తున్నవారు 53 శాతం మంది ఉన్నారట. మిగతా నగరాలతో పోలిస్తే ఇదే అత్యధికం కావ డం విశేషం. ముంబై, పుణే నగరాలు 52 శాతం ఓటరు చైతన్యంతో రెండోస్థానంలో నిలిచాయి. ఢిల్లీలో 47 శాతం మంది మాత్రమే ఓటు వేయడానికి ముందుకొస్తున్నారు. తెలంగాణ రాజధా ని హైదరాబాద్ ఈ విషయంలో మరింత వెనుకబడింది. ఇక్కడ కేవలం 45 శాతం మంది మాత్రమే ఓటుపై ఆసక్తి కనబరుస్తున్నారు. కారణాలివే.. నగరాల్లో స్థిరపడుతున్నవారంతా వలస వచ్చినవారే కావడంతో ఓటు నమోదుపై పెద్దగా ఆసక్తి చూపడంలేదు. యువతలో 75 శాతం మందికి తమ ఓటును ఎలా నమోదు చేసుకోవాలన్న అంశంపై అవగాహనే లేదు. పట్టణాల్లో స్థిరపడినా పుట్టిన గ్రామాల్లోనే ఓటు వేయడానికి 60 శాతం మంది ఆసక్తి చూపడం. ఇక 40 శాతం మంది ఓటర్ ఐడీ ఉంటే దేశంలో ఎక్కడైనా ఓటుహక్కు వినియోగించుకోవచ్చని విశ్వసిస్తున్నారు. ఈసారి తప్పకుండా వేస్తాం.. కనీసం ఈసారైనా ఓటు వేస్తారా? త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకుంటారా? అని సర్వే సంస్థ అడిగిన ప్రశ్నలకు 75 శాతం మంది ‘ఈసారి తప్పకుండా వేస్తామ’ని చెప్పారు. మరో 20 శాతం మంది మాత్రం వేయాలనే ఉన్నా కుదరదేమోననే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మిగతా ఐదు శాతం మంది మాత్రం తాము ఓటు వేయబోమని కచ్చితంగా తేల్చేశారు. వేసినా పెద్దగా మారేదేమీ లేనప్పుడు ఎందుకు వేయాలంటూ ఎదురు ప్రశ్నించారు. -
మొత్తం ఓటేసింది 2,05,80,470 మంది!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మొత్తం 2,80,64,684 మంది ఓటర్లకు 2,05,80,470(73.2 %) మంది ఓటేశారు. అందులో 1,41,56,182 మంది మొత్తం పురుష ఓటర్లలో 1,03,17,064 (72.54%) మంది..1,39,05,811 మంది మొత్తం మహిళా ఓటర్లలో 1,02,63,214 (73.88%) మంది ఓటు హక్కును వినియోగిం చుకున్నారు. 2,691 మంది ఇతర ఓటర్లలో కేవలం 192(8.99%) మంది మాత్రమే ఓటేశారు. ఈమేరకు ఎన్నికల్లో పోలైన ఓట్ల గణాంకాలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం బుధవారం విడుదల చేసింది. -
మహాకూటమిదే అధికారం
గరిడేపల్లి/కోదాడ: రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి అధికారంలోకి రావటం ఖాయమని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన సూర్యాపేట జిల్లా గరిడేపల్లిలో విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు కేసీఆర్ పాలనకు నేటితో వీడ్కోలు పలికారన్నారు. నాలుగున్నర సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో ప్రజలు విసిగి వేసారి పోయారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్లు సీఎం కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా లైన్లో నిలబడి ఓట్లు వేశారన్నారు. రాష్ట్రంలో 85 సీట్లలో మహాకూటమి విజయం సాధించబోతోందన్నారు. కాంగ్రెస్, టీజేఎస్, టీడీపీ, సీపీఐ పార్టీల కూటమి ఆధ్వర్యంలో ఈనెల 12న ప్రజా ఫ్రంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. ఓటింగ్‌శాతం ఎంత పెరిగితే అంతే స్థాయిలో మెజార్టీ సీట్లు కూటమికి రావడం ఖాయమన్నారు. ఎన్నికల్లో ఉత్సాహంగా పాల్గొని మహాకూటమికి ఓట్లు వేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. ఆయనవెంట సినీ నిర్మాత బండ్ల గణేశ్ ఉన్నారు. పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఉత్తమ్ గరిడేపల్లి, పొనుగోడు, కీతవారిగూడెంలో గ్రామాలలో పోలింగ్ కేంద్రాలను ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పరిశీలించారు. అధికారులను అడిగి పోలింగ్ సరళిని తెలుసుకున్నారు. ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన ఓటర్లతో ముచ్చటించారు. కోదాడలో ఓటేసిన ఉత్తమ్ టీపీసీసీ అధ్యక్షుడు, హుజూర్నగర్ కాంగ్రెస్ అభ్యర్థి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం కోదాడలో తన ఓటు హక్కును వినియోగించుకున్నా రు. గతంలో ఆయన రెండు సార్లు కోదాడ ఎమ్మెల్యేగా పనిచేయడంతో ఆయన ఓటు పట్టణంలోని రెండవ వార్డులో నమోదై ఉంది. పట్టణంలోని అనంతగిరి రోడ్డులో ఉన్న ఈవీరెడ్డి డిగ్రీ కళాశాల లో ఏర్పాటు చేసిన బూత్‌కు ఆయన మధ్యాహ్నం 12 గంటల సమయంలో వచ్చి ఓటు వేశారు. -
వచ్చేది.. మన సర్కారే
సాక్షి, సిద్దిపేట: ‘ఎక్కడా ఏమీ అనుమానం లేదు.. అంతా సర్దుకుంది. ప్రభుత్వంలో ఎటువంటి మార్పు ఉండదు.. మళ్లీ మన ప్రభుత్వమే వస్తుంది’అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన సతీమణి శోభారాణితో కలసి సిద్దిపేట జిల్లాలోని తన స్వగ్రామం చింతమడకలో ఓటు వేశారు. జిల్లాలోని కొండపాక మండలం ఎర్రవల్లి ఫాంహౌజ్ నుంచి హెలికాప్టర్ ద్వారా ఆయన సిద్దిపేట రూరల్ మండలం చింతమడకకు వచ్చారు. హెలికాప్టర్ దిగగానే తన చిన్నాన్న బాలకిషన్‌రావుకు పాదాభివందనం చేశారు. అక్కడి నుంచి ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. అక్కడే వారు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం కేసీఆర్ దంపతులు గ్రామస్తులను ఆత్మీయంగా పలకరించారు. చిన్ననాటి స్నేహితులతో కేసీఆర్ కరచాలనం చేశారు. ఈ సందర్భంగా సీఎం మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు సజావుగా జరుగుతున్నాయని అన్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పారు. హైదరాబాద్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా వృద్ధులు, మహిళలు ఓట్లు వేసేందుకు స్వచ్ఛందంగా తరలివస్తున్నారని చెప్పారు. రాష్ట్రమంతటా టీఆర్ఎస్ అనుకూల పవనాలు వీస్తున్నాయని.. టీఆర్ఎస్ ప్రభుత్వ ఏర్పాటులో ఎటువంటి సందేహం లేదని ధీమా వ్యక్తం చేశారు. ఓటు ప్రజాస్వామ్యంలో కీలకమని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సందడి అయిపోయి.. ప్రభుత్వం ఏర్పాటు తర్వాత పదిహేను రోజుల్లో గ్రామానికి మళ్లీ వస్తానని, మీ ఆశీస్సులు తీసుకొని గ్రామాభివృద్ధిపై చర్చిస్తానని చెప్పారు. కేసీఆర్ వెంట మంత్రి హరీశ్‌రావు, రాజ్యసభ సభ్యుడు సంతోశ్ తదితరులు ఉన్నారు. -
మొదటిసారిగా ఓటు వేసిన గద్దర్
హైదరాబాద్: ప్రజాస్వామంలో ఓటు హక్కు అం దరూ వినియోగించుకోవాలని ప్రజా గాయకుడు గద్దర్ అన్నారు. మొదటిసారిగా అల్వాల్ సర్కిల్ లోని వెంకటాపురం డివిజన్లో భార్య విమలతో కలసి ఓటు వేశారు. ఓటుతోనే పాలకుల ఎన్నిక జరుగుతుండటం వలన.. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని పేర్కొన్నారు. ఓట్లతోనే మార్పు జరగాలని, ఓట్ల విప్లవం సృష్టిం చి రాజ్యంగాన్ని పరిరక్షించుకోవాలని చెప్పారు. -
ఓటు వేసిన తెలంగాణ మంత్రులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పలువురు మంత్రులు ఈ ఉదయం ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా సామాన్యుల్లా వరుసలో నిలబడి ఓటు వేశారు. ఓటర్లు అందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా పిలుపునచ్చారు. సూర్యాపేట జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి కుటుంబ సమేతంగా వచ్చి సూర్యాపేట శ్రీ చైతన్య స్కూల్ లో 82వ నెంబర్ బూత్ లో ఓటు వేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం పోచారం గ్రామంలో సతీమణితో కలిసి మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. సిద్దిపేట జిల్లా మంత్రి హరీశ్‌రావు దంపతులు సిద్దిపేటలోని 102వ పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ప్రజలంతా ఓటు వేయాలని ఈ సందర్భంగా హరీశ్‌రావు పిలుపునిచ్చారు. -
ఆ ఇద్దరు అంతరిక్షం నుంచే ఓటు వేసేశారు!
వాషింగ్టన్ : డెమొక్రాటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ నువ్వా..నేనా అంటూ పోటీపడుతున్న అమెరికా అధ్యక్ష పీఠ ఎన్నికల సమరం మొదలైంది. సుమారు నాలుగుకోట్ల మంది ముందస్తు ఓటింగ్ వేయగా... మిగిలినవారు నేడు జరిగే పోలింగ్‌లో పాల్గొంటున్నారు. భూమికి 17వేల మైళ్ల దూరంలో ఇద్దరు అమెరికన్ వ్యోమగాములూ అంతరిక్షం నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. షేన్ కిమ్బ్రో వ్యోమగామి అధికారికంగా తన ఓటు హక్కును ఎలక్ట్రానిక్ బ్యాలెట్ ద్వారా అంతరిక్ష పరిశోధన సంస్థ(ఐఎస్ఎస్) నుంచి వినియోగించుకున్నట్టు నాసా ప్రకటించింది. మరో వ్యోమగామి కేట్ రాబిన్స్ కూడా తను భూమిపైకి వచ్చే వారం ముందు అంతరిక్షం నుంచి ఓటు వేసినట్టు తెలిపింది. 1997లో టెక్సాస్ చట్టసభలు పాస్ చేసిన బిల్లు వల్ల ఇది సాధ్యమైందని, ఆస్ట్రోనాట్స్ కోసం ఈ టెక్నికల్ ఓటింగ్ ప్రక్రియను తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపింది. ఓటు వేసిన ఈ ఇద్దరు వ్యోమగాములు జాన్స్సన్ స్పేస్ సెంటర్ సమీపంలోని హోస్టన్ ప్రాంతానికి చెందిన వారు. ఏ ఎలక్షన్(స్థానిక/రాష్ట్ర,/ ఫెఢరల్)ను వారు వినియోగించుకోవలనుకుంటున్నారో తెలుపడంతో ఏడాది కిందటి నుంచే వ్యోమగాముల ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని అమెరికా స్పేస్ ఏజెన్సీ తెలిపింది. దీంతో వారు అంతరిక్షం నుంచే ఓటు వేయొచ్చని పేర్కొంది. ఎన్నికలు ప్రారంభమవడానికి ఆరు నెలల ముందుకు వ్యోమగాములకు స్టాండర్డ్ ఫామ్ ఇస్తారు. అది ఓటర్ రిజిస్ట్రేషన్, స్థలాంతర బ్యాలెట్ రిక్వెస్ట్-ఫెడరల్ పోస్టు కార్డు అప్లికేషన్ అని ఏజెన్సీ పేర్కొంది. 1997లో మొదటిసారి ఉపయోగించిన ఈ స్పేస్ ఓటింగ్‌ను, నాసా వ్యోమగామి డేవిడ్ వోల్ఫ్ తొలుత అంతరిక్షం నుంచి ఓటు వేశారు. దీంతో అంతరిక్షం నుంచి ఓటు హక్కు వినియోగించుకున్న మొదటి అమెరికన్ వ్యోమగామిగా ఆయన పేరొందారు. -
ఓటు హక్కు వినియోగించుకుంటున్న ప్రముఖులు
-
ఆటోలో వెళ్లి ఓటేసిన నరేంద్ర మోడీ తల్లి
-
ఆటోలో వెళ్లి ఓటేసిన నరేంద్ర మోడీ తల్లి
కన్న కొడుకు రాష్ట్ర ముఖ్యమంత్రి, లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధిస్తే ఆ ముఖ్యమంత్రే ప్రధాని పీఠం అధిష్టిస్తారని బీజేపీ ఇప్పటికే ప్రకటించింది. అయినా ఆమె మాత్రం ఎటువంటి హంగు ఆర్బాటాలు లేకుండా ఆటోలో వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకుంది. ఆమె గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ తల్లి హీరా బెన్ (77). గుజరాత్లో బుధవారం లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఆహ్మదాబాద్‌లోని సెక్టర్ 22లోని పోలింగ్ బూత్‌లో ఓటు వేసేందుకు ఆమె ఇంటి నుంచి ఆటోలో వెళ్లి ఓటు వేసి వచ్చారు.