Karnataka Elections: Bride Reaches Poll Booth In Wedding Attire To Cast Vote In Chikkamagaluru - Sakshi
Sakshi News home page

Karnataka Assembly Elections: పెళ్లి దుస్తుల్లో ముస్తాబై ఓటేసిన వధువు

Published Wed, May 10 2023 10:48 AM | Last Updated on Wed, May 10 2023 11:18 AM

Karnataka Election: Bride Reaches Poll Booth In Wedding Attire To Cast Vote - Sakshi

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు పోలింగ్‌ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్‌ సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. రాష్ట్రంలోని మొత్తం 224 స్థానాలకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో.. బీజేపీ, కాంగ్రెస్‌, జీడీఎస్‌ మధ్యే ప్రధానంగా పోరు నడుస్తోంది. మొత్తం 2,165 మంది అభ్యర్థులు బరిలో ఉండగా ఓటింగ్ కోసం 58,545 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మే 13న ఫలితాలు వెల్లడి కానున​ఆనయి.

కాగా అసెంబ్లీ పోలింగ్‌లో భాగంగా చిక్కమగళూరు జిల్లాలో అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. తన పెళ్లి రోజు ఓ వధువు ఓటేసేందుకు పోలింగ్‌ బూత్‌కు వచ్చింది. మకొనహలి గ్రామానికి చెందిన ఓ యువతి పెళ్లి దస్తుల్లో ముస్తాబై ముదిగేరే అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటేసింది. మరికొన్ని గంటల్లో పెళ్లి ఉండగా.. పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఓటేసిన వధువును ఎన్నికల అధికారులు అభినందించారు. కాగా ముదిగెరె నియోజకవర్గంలో బీజేపీ నుంచి దీపక్‌ దొడ్డయ్య, జేడీఎస్‌ ఎంపీ కుమారస్వామి, కాంగ్రెస్‌ నుంచి నయన జ్యోతి ఝవార్‌ మధ్య పోటీలో నిలిచారు.
చదవండి: Karnataka Elections 2023: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు.. లైవ్‌ అప్‌డేట్స్‌

కర్ణాటక ఎన్నికల్లో ఇప్పటి వరకు పలువురు ప్రముఖులు ఓటేశారు. ఇన్ఫోసిస్‌ ఫౌండర్‌ నారాయణమూర్తి, ఆయన సతీమణి సుధా మూర్తి బెంగళూరులోని జయనగర్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇన్ఫోసిస్‌ కో ఫౌండర్‌ నందన్‌ నీలేఖని బెంగళూరులోని కొరమంగళ పోలింగ్‌ కేంద్రంలో ఓటేశారు. నిర్మలా సీతారామన్‌, సీఎం బసవరాజ్‌ బొమ్మై, బీఎస్‌ యడ్యూరప్ప, డికే శివకుమార్, సిద్ధ రామయ్య, సినీనటులు ప్రకాష్‌రాజ్‌, కాంతారా ఫేం రిషభ్‌ షెట్టి, గణేష్‌ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు  జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌కు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. అయితే గడిచిన 38 ఏళ్లుగా కర్ణాటకలో ఏ ఒక్క పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి రాలేదు. ఈ సెంటిమెంట్‌ను బ్రేక్‌ చేయాలని బీజేపీ భావిస్తుండగా.. దక్షిణాది రాష్ట్రంలో సత్తా చాటి దేశ రాజకీయాల్లో తన ప్రతిష్టను పెంచుకోవాలని కాంగ్రెస్‌ చూస్తోంది. ఇక ‘హంగ్‌’పై జేడీఎస్‌ మరోసారి ఆశలు పెట్టుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement