రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు) ఢిల్లీకి చేరడంతో తెలంగాణ ప్రాంత నాయకులు సంబరపడుతున్నారు. త్వరలోనే పార్లమెంటులో ప్రవేశపెడతారని, ఇక రాష్ట్రం సిద్ధించినట్లేనని భావిస్తున్నారు. హస్తిన చేరిన మంత్రులు జానారెడ్డి, డీకే అరుణ, సునీతా లక్ష్మారెడ్డి, ఉత్తమ కుమార్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్యే రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఈ సందర్భంగా ఢిల్లీ విమానాశ్రయంలో తెలంగాణ బిల్లు ప్రతులు సూట్ కేసులతో ఫోటోలు దిగారు.
కాగా 400 కిలోల గల 15 బండిల్స్ ప్రభుత్వ జాయింట్ సెక్రటరీ లలితాంబిక ఆధ్వర్యంలో తెలంగాణ బిల్లు ముందుగా ఏపీ భవన్ కు, అక్కడ నుంచి కేంద్ర హోంశాఖకు చేరింది. మరోవైపు తెలంగాణ బిల్లుపై సభ్యుల అభిప్రాయాల నివేదిక ఉదయం 11.45 గంటలకు ఢిల్లీ చేరనుంది.