సాక్షి, అమరావతి: బీఆర్‌ఎస్ పెట్టడం తప్పు కాదని.. ఎవరు ఎక్కడైనా పోటీ చేయొచ్చని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ,కేఏ పాల్ కూడా 175 స్థానాల్లో పోటీ చేశారు. బీఆర్‌ఎస్ కూడా అన్ని స్థానాల్లో పోటీ చేయవచ్చన్నారు. ఏపీలో కాంగ్రెస్, సీపీఐతోనే బీఆర్‌ఎస్ పోటీ పడుతుందని పేర్ని నాని వ్యాఖ్యానించారు.
‘‘తెలంగాణ మంత్రులు ఏపీని ఏం ఉద్దరిస్తారు?. ఏపీకి ద్రోహం చేసింది తెలంగాణ నేతలే. తెలంగాణ మంత్రులు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్‌లో దొంగ కరెంట్ ఉత్పత్తి చేస్తున్నారు. ఏపీకి రావాల్సిన ఆస్తులు, నిధులు కూడా ఇవ్వడం లేదు’’ అని పేర్ని నాని మండిపడ్డారు.
చదవండి: డేంజర్ గేమ్.. చంద్రబాబు ప్లాన్ అదే..? ఇదిగో రుజువులు..
Comments
Please login to add a commentAdd a comment