
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లో కాస్త ముందుగానే ఎన్నికలు జరగనున్నాయా?. ఇందుకు సంబంధించి ఇవాళ జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాస్త ముందుగానే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని.. అయినా ఎన్నికలకు పూర్తి సన్నద్ధంగా ఉన్నామని మంత్రులతో వ్యాఖ్యానించారాయన.
‘‘ఎన్నికలకు పూర్తి సన్నద్ధంగా ఉన్నాం. అయినా సరే మంత్రులు క్షేత్ర స్థాయిలో మరింత సమర్థవంతంగా పని చేయాలి. గతంలో కంటే 20 రోజుల ముందుగానే ఎన్నికల షెడ్యూల్ విడుదల కావొచ్చు’’ అని కేబినెట్ భేటీలో సీఎం జగన్ అన్నారు.
అదే సమయంలో ప్రతిపక్ష పార్టీలు.. వాటికి కొమ్ము కాస్తున్న మీడియా సంస్థలు చేసే విష ప్రచారాలను తేలికగా తీసుకోవద్దని మంత్రులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఈనాడు, యెల్లో మీడియాలో జరిగే ప్రచారాన్ని బలంగా తిప్పి కొట్టాలని మంత్రులకు సీఎం జగన్ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment