Attack on Doctors: India Govt Ordinance Making, Punishable with up to 7 Years Prison, Corona Latest News in Telugu - Sakshi Telugu
Sakshi News home page

వైద్యులపై దాడిచేస్తే ఏడేళ్ల జైలు

Published Wed, Apr 22 2020 3:37 PM | Last Updated on Wed, Apr 22 2020 5:01 PM

Central Cabinet Reviews Lockdown Implementation Across The Country - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారిపై ముందుండి పోరాడుతున్న వైద్యులు, వైద్య సిబ్బందిపై జరుగుతున్న దాడులను బుధవారం కేంద్ర కేబినెట్‌ తీవ్రంగా పరిగణించింది.వైద్యులపై దాడులను నిరోధించేందుకు ఆర్డినెన్స్‌ తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది. 1897 ఎపిడెమిక్‌ చట్టంలో మార్పులు తెస్తూ ఈ ఏడాదిలోగా విచారణ పూర్తయ్యేలా ఆర్డినెన్స్‌ను తీసుకురానుంది. కరోనా సమయంలోనే కాకుండా ఆ తర్వాత కూడా ఆర్డినెన్స్‌ అమల్లో ఉండనుంది. కేంద్ర మంత్రివర్గ భేటీ అనంతరం మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ మీడియా సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. వైద్య సిబ్బందిపై దాడులు చేస్తే కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. దాడులకు పాల్పడితే మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకూ జైలు శిక్ష విధిస్తామని, నాన్‌బెయిలబుల్‌ అరెస్ట్‌ వారెంట్లు జారీ చేస్తామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.

వైద్యులపై దాడులకు పాల్పడేవారికి రూ లక్ష నుంచి రూ ఐదు లక్షల వరకూ జరిమానా విధిస్తామని చెప్పారు. వాహనాలు, ఆస్పత్రులపై దాడిచేస్తే వాటి మార్కెట్‌ విలువ కంటే రెండింతలు వసూలు చేస్తామని అన్నారు.డాక్టర్లు, వైద్య సిబ్బందికి పూర్తి భద్రత కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఆరోగ్య సిబ్బందికి రూ 50 లక్షల బీమా సదుపాయం కల్పిస్తామని వెల్లడించారు. 50 లక్షల మాస్క్‌లకు ఆర్డరిచ్చామని, వైద్య పరికరాల కొరత లేకుండా చర్యలు చేపడుతున్నామని పేర్కొంది. ఇక కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా మే 3 వరకూ విధించిన లాక్‌డౌన్‌ అమలు తీరుతెన్నులను కేంద్ర మంత్రివర్గం సమీక్షించిందని చెప్పారు. లాక్‌డౌన్‌ నియమ నిబంధనలు ఆయా రాష్ట్రాల్లో అమలవుతున్న తీరును పర్యవేక్షించామని తెలిపారు.

చదవండి : 'కరోనాపై పోరులో మీడియా ప్రముఖ పాత్ర'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement