
బీఆర్‌ఎస్ ఆవిర్భావం జరిగిన మరుసటి రోజే.. తెలంగాణ కేబినెట్ భేటీ కావడం..
సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ ఆవిర్భావం జరిగిన మరుసటి రోజే.. తెలంగాణ కేబినెట్ భేటీ కావడం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది.
ధాన్యం కొనుగోళ్లు, దళిత బందు అమలు, సొంత ఇంటి స్థలం కలిగిన వారికి రూ. 3 లక్షల ఆర్ధిక సహాయం, రైతు బంధు నిధుల విడుదల తో పాటు అసెంబ్లీ సమావేశాల తేదీల ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే.. గవర్నర్ వద్ద పెండింగ్ లో బిల్లులపై ఏం చేయాలనే దానిపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. వీటితో పాటు..
పోడు భూములకు పట్టాలు పంపిణీ తేదీల ప్రకటన కూడా ఉండే అవకాశం కనిపిస్తోంది. అలాగే.. గిరిజన బంధు లాంటి కీలకాంశంపై నిర్ణయం తీసుకోవచ్చనే చర్చ నడుస్తోంది.