ప్రగతి భవన్‌లో గణతంత్ర వేడుకలు.. జెండా ఎగురవేసిన సీఎం కేసీఆర్‌ | Telangana CM KCR Republic Day Celebrations At Pragathi Bhavan | Sakshi
Sakshi News home page

ప్రగతి భవన్‌లో గణతంత్ర వేడుకలు.. జెండా ఎగురవేసిన సీఎం కేసీఆర్‌

Published Thu, Jan 26 2023 12:05 PM | Last Updated on Thu, Jan 26 2023 2:47 PM

Telangana CM KCR Republic Day Celebrations At Pragathi Bhavan - Sakshi

హైదరాబాద్‌: తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు. 74వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించారు. సీఎంతో పాటు పలువురు మంత్రులు, సీఎస్, డీజీపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేడుకల సందర్భంగా జాతిపిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేడ్కర్ చిత్రపటాలకు కేసీఆర్‌ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశానికి వారు చేసిన సేవలను స్మరించుకున్నారు.

ఈ వేడుకల్లో మంత్రులు ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, మల్లారెడ్డి, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, నవీన్‌రావు, శంభీపూర్ రాజు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముందు సికింద్రాబాద్ మైదానంలో అమరజవాన్ల స్థూపం వద్ద కేసీఆర్ నివాళులు అర్పించారు.
చదవండి: తెలంగాణ రాజ్‌భవన్‌లో ఘనంగా గణతంత్ర వేడుకలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement