సాక్షి,అమరావతి: ఏపీ క్యాబినెట్ సమావేశం ముగిసింది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో మంత్రి వర్గం పలు అంశాలపై చర్చించి, నిర్ణయాలు తీసుకుంది. ఉగాదికి అందించే సంక్షేమ పథకాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఉగాది సంబరాలు ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. అజెండాలోని అన్ని అంశాలకు ఆమోదం తెలిపింది.
వై ఎస్సార్ లా నేస్తం, వై ఎస్సార్ ఆసరా, ఈ బీసీ నేస్తం, వైఎస్సార్ కల్యాణ మస్తులను మంత్రి వర్గం ఆమోదించింది. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, రాష్ట్రంలో భారీ పరిశ్రమల ఏర్పాటు ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్ ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ప్రధానంగా 70 అజెండా అంశాలపై క్యాబినెట్ చర్చించింది.
Comments
Please login to add a commentAdd a comment