ముంబై: నేషనల్ యూరియా పాలసీలో మార్పులకు శుక్రవారం క్యాబినెట్ ఆమోదించనందనే అంచనాలతో ఫెర్టిలైజర్స్ కౌంటర్‌కు డిమాండ్ పుట్టింది. యూరియా ఉత్పత్తిని గణనీయంగా పెంచాలనే ప్రధాన లక్ష్యంతో కేంద్రం నేషనల్ యూరియా పాలసీలో మార్పులు తేనుంది. దేశీయ యూరియా ఉత్పత్తిలో ఎనర్జీ సామర్ద్యం, ప్రోత్సాహం, ప్రభుత్వంపై సబ్సిడీ భారం హేతుబద్ధీకరించడం లాంటి చర్యలపై దృష్టిపెట్టనుంది.
జాతీయ యూరియా విధాన సవరణను కేంద్ర కేబినెట్ చేపట్టనున్నట్లు వెలువడ్డ వార్తలతో ఎరువుల కంపెనీ షేర్లు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్ కోర్ (ఫ్యాక్ట్ ) 17 శాతం దూసుకెళ్లగా.. మద్రాస్ ఫెర్టిలైజర్స్ 14 శాతం, ఆర్‌సీఎఫ్ 13 శాతం, చంబల్ 8 శాతం, దీపక్ 8 శాతం చొప్పున ఎగశాయి. ఈ బాటలో 3.1 శాతం కోరమాండల్ ఇంటర్నేషనల్ 3.4శాతం పెరిగింది, దీపక్ ఫెర్టిలైజర్స్ 3.2శాతం , సదరన్ పెట్రోకెమ్ 7 శాతం, జువారీ ఆగ్రో, మంగళూర్ కెమ్, ఎన్‌ఎఫ్‌సీఎల్ 5 శాతం, జీఎన్‌ఎఫ్‌సీ 4 శాతం చొప్పున దూసుకుపోయాయి.
కాగా మే 2015 లో, యూనియన్ క్యాబినెట్ తరువాతి నాలుగు ఆర్థిక సంవత్సరాలకుగాను (జూన్ 2015-మార్చి 2019) ఒక సమగ్ర న్యూ యూరియా విధానాన్ని ఆమోదించింది తాజాగా ఎరువుల సబ్సిడీలను వాస్తవిక అమ్మకాల ఆధారంగా బదిలీ చేసేందుకు కేంద్ర కేబినెట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.