రుణమాఫీ ఊసెత్తని ఏపీ కేబినెట్ సమావేశం
లక్షలాది మంది రైతులు.. కోట్లాది రూపాయల రుణాలను మాఫీ చేస్తారా లేదా అని ఎదురు చూస్తుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం మాత్రం అటు రుణమాఫీ గురించి గానీ, ఇటు రుణాల రీషెడ్యూల్ గురించి గానీ ఏమాత్రం చర్చించకుండానే మంత్రివర్గ సమావేశాన్ని ముగించేసింది. లేక్వ్యూ అతిథి గృహంలోని ఏపీ సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఇలా ఉన్నాయి...
* అక్టోబర్ 2 నుంచి ఇళ్లు, పరిశ్రమలకు 24 గంటలు విద్యుత్ సరఫరా
* 2వేల మెగావాట్ల విద్యుత్ సమకూర్చుకోవాలని నిర్ణయం
* వ్యవసాయ సంస్కరణలకు శ్రీకారం చుట్టాలని నిర్ణయం
* 13.50 లక్షల విద్యుత్ మోటార్లను మార్చాలని నిర్ణయం
* ఆదర్శ రైతుల స్థానంలో ఎంపీఈవోల నియామకం.. ప్రతి వెయ్యి హెక్టార్లకు ఒక ఎంపీఈవో
* అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 100 శాతం డ్రిప్ ఇరిగేషన్
* ఆరోపణలున్న 3వేల మంది ఫీల్డ్ అసిస్టెంట్ల తొలగింపు
* మిగిలినవారిపై తొలగింపుపై అధికారం మంత్రులదే
* ఉపాధిహామీ పథకం ద్వారా మొక్కల పెంపకం, సిమెంట్ల రోడ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయం
* పారదర్శకత కోసం 7 మిషన్ల ఏర్పాటు
* 2020 నాటికి ఏపీని టాప్ 3లో ఉంచేందుకు లక్ష్యం
* ఎంసెట్ కౌన్సెలింగ్ త్వరగా జరిపేందుకు తెలంగాణ సీఎంకు లేఖ రాయాలని నిర్ణయం