(ఫైల్ ఫోటో)
సాక్షి, హైదరాబాద్ : లాక్‌డౌన్, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కరోనా వ్యాప్తి వంటి అంశాలపై చర్చించేందుకు సమావేశమైన తెలంగాణ మంత్రిమండలి భేటీ ముగిసింది. ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ప్రగతి భవన్‌లో ఈ భేటీ జరిగింది. కరోనా నియంత్రణ చర్యలు, లాక్‌డౌన్ పొడిగింపుపై ముఖ్యంగా మంత్రి మండలి చర్చించింది. గ్రీన్‌జోన్లలో మద్యం షాపులు తెరవడంతోపాటు.. మద్యం ధరలను పెంచే విషయాన్ని కేబినెట్ పరిశీలించనుంది. మరోవైపు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఈనెలాఖరు వరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లాక్‌డౌన్ పొడిగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. (మొబైల్ యాప్, వెబ్‌సైట్ ద్వారా మద్యం విక్రయం)
అలాగే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్‌లోనూ లాక్‌డౌన్ పొడిగించనున్నట్లు తెలుస్తోంది. వీటన్నింటిపై మంత్రిమండలి సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. పొరుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలు మద్యం దుకాణాలను తెరవడంతో తెలంగాణలో షాపులు తెరుస్తారా..? లేదా అనేది ఉత్కంఠగా మారింది. దీనిపై నేటి మీడియా సమావేశంలో కేసీఆర్ తుది నిర్ణయం వెల్లడించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment