
టాలీవుడ్ హీరో రానా పేరు చెప్పగానే అందరికీ 'బాహుబలి' సినిమా గుర్తొస్తుంది. ఎందుకంటే ఈ సినిమాతో పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ఆ తర్వాత ఎందుకో కెరీర్ సరిగా ప్లాన్ చేసుకోలేకపోయాడు. కొన్నాళ్ల క్రితం 'రానా నాయుడు' సిరీస్‌లో నటించాడు. యాక్టింగ్ చేయనప్పటికీ నిర్మాణం, ఇతర తెలుగు సినిమాల్ని ప్రమోట్ చేసే విషయంలో ముందుంటాడు. ఇదంతా పక్కనబెడితే తాజాగా రానా ఆఫ్ స్క్రీన్ బిహేవియర్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది.
(ఇదీ చదవండి: 'హాట్ స్పాట్' సినిమా రివ్యూ (ఓటీటీ))
తాజాగా ఓ హోటల్‌లో స్టే చేసేందుకు రానాకు అక్కడ సిబ్బంది పుష్ప గుచ్చంతో పాటు శాలువా బహుకరించారు. అందరిలానే వాటిని తీసుకుని పక్కనవాళ్లకు ఇచ్చేయకుండా తనకు ఎవరైతే ఇచ్చారో ఆ మహిళా సిబ్బందికే ఫ్లవర్ బొకే ఇచ్చి, శాలువా కూడా తన చేతులతో కప్పేశాడు. దీన్ని చూసి కొందరు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం రానా ఫ్రెండ్లీ నేచర్‌ని మెచ్చుకుంటున్నారు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?)
Actor @RanaDaggubati in his natural habitat off screen 🤩#RanaDaggubati #Rana #Tollywood #PopperStopTelugu pic.twitter.com/FiCISww8Ip
— Popper Stop Telugu (@PopperstopTel) July 22, 2024