యశవంతపుర: బిగ్‌బాస్ రియాలిటీ షో లో ఫైనల్స్‌కు చేరిన వర్తూరు సంతోష్‌ను బెంగళూరులో ఎస్‌ఐగా పని చేసే తిమ్మరాయప్ప సన్మానించారు. ఇది సబబు కాదంటూ పోలీసు కమిషనర్ దయానంద.. ఆ ఎస్‌ఐని వర్తూరు పీఎస్ నుంచి ఆడుగోడికి బదిలీ కానుక ఇచ్చారు.
బిగ్‌బాస్‌లో పేరుగాంచిన సంతోష్‌కు అనేక మంది అభిమానులు ఉన్నారు. గతంలో మెడలో పులిగోరు వేసుకోవడంతో అతనిపై కేసు కూడా అయి జైలుకెళ్లి వచ్చాడు. అలాంటి వ్యక్తికి యూనిఫాంలో ఉన్న ఎస్‌ఐ గంధమాల వేసి మైసూరు పేటాతో సత్కరించడం, ఆ వీడియోలు, ఫోటోలు వైరల్ కాగా అనేకమంది ఎస్‌ఐని తప్పుబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment