బిగ్‌బాస్ తెలుగు సీజన్-7 విన్నర్ పల్లవి ప్రశాంత్‌పై తెలంగాణ పోలీసులు కేసు పెట్టిన విషయం తెలిసిందే. ముందు గేటు నుంచి రావద్దని పోలీసులు చెప్పినా కూడా ప్రశాంత్ రావడం వల్ల అక్కడ పరిస్థితి కంట్రోల్ చేయడం తమ వల్ల కాలేదేని ఆ సమయంలో పోలీసులు తెలిపారు. ఆ సమయంలో తెలంగాణ ఆర్టీసీ బస్సులు కూడా ధ్వంసం అయ్యాయి. దీంతో సుమోటోగా పోలీసులు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
అయితే ఉదయం నుంచి పల్లవి ప్రశాంత్ పరారీలో ఉన్నట్లు వార్తలొచ్చాయి. ఈ విషయంపై ప్రశాంత్ లాయర్, హైకోర్టు న్యాయవాది డాక్టర్ కే రాజేశ్‌కుమార్ కూడా మీడియాతో మాట్లాడారు. ఈ కేసుల వల్ల భయపడిన పల్లవి ప్రశాంత్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని.. అందుకే ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలని జూబ్లీహిల్స్ పోలీసులను సంప్రదించినట్లు వెల్లడించారు.
అయితే తాజాగా బిగ్‌బాస్ విన్నర్ ఓ వీడియో రిలీజ్ చేశారు. తాను ఎక్కడికి పోలేదని.. ఇంటివద్దనే ఉన్నా.. కొందరు కావాలనే నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నా వల్ల ఇబ్బంది కలిగితే నన్ను క్షమించండి.. కొందరు కావాలనే ఇలా చేసి నాపై నెగెటివ్ చేస్తున్నారు. నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది.. ఇంతవరకు నేను ఫోన్ కూడా పట్టుకోలే.. వేరేవాళ్ల ఫోన్‌లో లాగిన్ అయి వీడియోలు పెట్టానని అన్నాడు. ఎవరు టెన్షన్ పడకుర్రి.. నేను ఊర్లోనే ఉన్నానంటూ పల్లవి ప్రశాంత్ వీడియోలో మాట్లాడారు.
సాక్షితో బిగ్ బాస్-7 విన్నర్ పల్లవి ప్రశాంత్ మాట్లాడుతూ..'ఇంట్లోనే ఉన్నా.. నేను ఎక్కడికి పారిపోలేదు. కావాలనే కొందరు నా పై దుష్ప్రచారం చేస్తున్నారు. బస్సులపై దాడికి నాకు ఎలాంటి సంబంధం లేదు. అలాంటి చర్యలను ఖండిస్తున్నా. నా గెలుపు రైతుల విజయం. నా గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నా పై వస్తున్నా తప్పుడు వార్తలతో కలత చెందా. జీవితాంతం రైతు బిడ్డగానే ఉంటా. రేపటి నుంచి వ్యవసాయ పనుల్లో ఉంటా. హౌస్‌లో శివాజీ అన్న నాకు అండగా ఉన్నారు. నాగార్జున ,శివాజీ గారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటా.' అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment