పండుగలకు ప్రత్యేక రైళ్లు | special trains for festivals | Sakshi
Sakshi News home page

పండుగలకు ప్రత్యేక రైళ్లు

Published Mon, Dec 25 2017 2:20 AM | Last Updated on Mon, Dec 25 2017 2:20 AM

special trains for festivals - Sakshi

విజయవాడ : వరుస పండుగల నేపథ్యంలో పలు రూట్లలో ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు విజయవాడ రైల్వే డివిజన్‌ ఇన్‌చార్జి పీఆర్వో జేవీ ఆర్కే రాజశేఖర్‌ ఆదివారం తెలిపారు. హైదరాబాద్‌–తిరుపతి (07441) 27న సాయంత్రం 6.00కు హైదరాబాద్‌లో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 7.00కు తిరుపతి చేరుకుంటుంది. తిరుపతి–హైదరాబాద్‌ (07442) 28న మధ్యాహ్నం 2.15కు తిరుపతిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4.30కు హైదరాబాద్‌ చేరుకుంటుంది. హైదరాబాద్‌–కాకినాడ పోర్ట్‌ రైలు (07447) ఈనెల 29న సాయంత్రం 6.50కు హైదరాబాద్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.45కు కాకినాడ పోర్ట్‌ చేరుకుంటుంది. కాకినాడ పోర్ట్‌–హైదరాబాద్‌ రైలు (07448) డిసెంబర్‌ 30న సాయంత్రం 5.55కి కాకినాడ పోర్ట్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.30కు హైదరాబాద్‌ చేరుకుంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement