రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): వేసవి సెలవుల్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విజయవాడ మీదుగా వేర్వేరు ప్రాంతాల నుంచి ఈ నెల 18న మూడు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. కాకినాడ టౌన్– సికింద్రాబాద్ రైలు (07187) రాత్రి 8.45 గంటలకు కాకినాడ టౌన్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 7.30 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది.
సికింద్రాబాద్ – కాకినాడ టౌన్ రైలు (07188) ఉదయం 8 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి, అదే రోజు సాయంత్రం 6.45 గంటలకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది. నర్సాపూర్–సికింద్రాబాద్ రైలు (07169) రాత్రి 8 గంటలకు నర్సాపూర్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 6.45 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ రైలు పాలకొల్లు, భీమవరం టౌన్, ఆకివీడు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల స్టేషన్లలో ఆగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment