వేసవి రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు
హైదరాబాద్ నుంచి కాకినాడ, అహ్మదాబాద్‌కు ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్–కాకినాడ (07001/07002) ప్రత్యేక రైలును ఏర్పాటు చేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 13వ తేదీ సాయంత్రం 6.50కి నాంపల్లి నుంచి బయలుదేరి మరుస టి రోజు ఉదయం 5.45కు కాకినాడ చేరుకుంటుంది. తిరు గుప్రయా ణంలో ఈ నెల 16వ తేదీ సాయంత్రం 6 గంటలకు కాకినాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.50 కి నాంపల్లి చేరుకుంటుంది.
అహ్మదాబాద్‌కు ప్రత్యేక రైలు..: హైదరాబాద్–అహ్మదాబాద్ (07018/07017) ప్రత్యేక రైలు ఈ నెల 18, 25, మే 2, 9, 16, 23, 30, జూన్ 6, 13, 20, 27 తేదీలలో సాయంత్రం 6.20 కి హైదరాబాద్ నుంచి బయలుదేరి మరుసటిరోజు రాత్రి 12.30కు అహ్మదాబాద్ చేరుకుంటుం ది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 20, 27, మే 4, 11, 18, 25, జూన్ 1, 8, 15, 22, 29 తేదీలలో ఉదయం 6.15కు అహ్మదాబాద్ నుంచి బయలు దేరి మరుసటి రోజు ఉదయం 11 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.