సంబరాల సంక్రాంతి సందడి సమీపిస్తోంది. ఏడాదిలో తొలి పండుగ సంక్రాంతి అంటే చాలా హడావిడి ఉంటుంది. దేశవ్యాప్తంగా సంబరాలు ఘనంగా నిర్వహించుకుంటారు. ముఖ్యంగా తెలుగువారిలో మరింత సందడి ఉంటుంది. పిండివంటలు, షాపింగ్‌లు కాదు అందంగా కనిపించడం అమ్మాయిలకు అందరికీ ఇష్టం. కెమికల్స్‌తో నిండిన బ్యూటీ ఉత్పత్తులు కాకుండా, సహజంగా ముఖ చర్మాన్ని శుభ్రం చేసి కాంతివంతంగా మార్చడంతో పాటు కొన్ని సంరక్షణా టిప్స్ తెలుసుకుందాం.
పండగ సందర్బంగా ముఖంమెరిసిపోవాలంటే.. ఇంట్లోనే దొరికే కొన్ని రకాల పదార్థాలో బ్యూటీ ప్యాక్స్‌ను తయారు చేసుకోవచ్చు. అలాగే ప్యాక్‌కు ముందు ముఖారికి ఆవిరి పట్టడం వలన మృత కణాలు తొలిగి, చర్మ రంధ్రాలు ఓపెన్ అవుతాయి. దీంతో మనం వేసుకున్న ప్యాక్ పోషకాలు అంది ముఖం మరింత అందంగా, షైనీగా ఉంటుంది.
పొటాటో ప్యాక్
ఒక చిన్న బంగాళదుంప (Potato) తీసుకుని శుభ్రంగా కడిగి తొక్క తీసి, చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఈ ముక్కలను మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి ,పల్చటి క్లాత్‌తో వడకట్టి రసం తీసుకోవాలి. ఈ రసంలో రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి(Rice Flour) కొద్ది పెరుగు,(Curd) కొద్దిగా బాదం ఆయిల్ వేసిన అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి కొంచెం మందంగా అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరనిచ్చి చల్లని నీటితో కడిగేసుకోవాలి. దీంతో నల్లమచ్చలు తొలిగి ఫేస్ అందంగా కనిపిస్తుంది.
శనగ పిండి ప్యాక్
రెండు స్పూన్ల శనగపిండి, కొద్దిగా పసుపు, రోజ్ వాటర్, పాల మీగడ, తేనె కలిపి మిశ్రమాన్ని సిద్ధం చేసుకోవాలి. ముందుగా ముఖాన్ని శుభ్రం చేసుకొని ఆవిరిపట్టి చల్లని నీళ్లతో కడుక్కోవాలి. ఆ తర్వాత ఈ ప్యాక్ అప్లై చేయాలి. ఆరిన తరువాత మృదువుగా పిండిని తొలగిస్తూ, శుభ్రంగా కడుక్కోవాలి. ఇన్‌స్టంట్ గ్లో వస్తుంది. అలాగే వారానికి రెండు, మూడు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. దీన్ని తలస్నానం చేసేముందు నలుగు పెట్టుకుంటే ముఖంతో పాటు చర్మానికి కూడా రాస్తే చాలా మంచిది. (కాల్షియం ఎక్కువగా ఎందులో ఉంటుంది రాగులా? పాలా?)
కాఫీ పౌడర్
కాఫీ పౌడర్, కొద్దిగా చక్కెర, నిమ్మరసం వేసి ముఖానికి అప్లయ్ చేయాలి. ఆరిన తరువాత శుభ్రంగా కడిగేసుకోవాలి. దీన్ని చేతులు, ముంచేతులు, మెడమీద కూడా రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
ఆవిరి పట్టడం: వేడినీళ్లలో కాసిన్ని పుదీనా ఆకులు, తులసి, వేపాకులు, పసుపు వేసి ముఖమంతా చెమటలు పట్టేదాకా ఆవిరి పడితే చర్మం బాగా శుభ్రపడుతుంది. చర్మం రంధ్రాలు ఓపెన్ అవుతాయి.
ఇదీ చదవండి: మాయదారి గుండెపోటు : చిన్నారి ‘గుండెల్ని’ పిండేస్తున్న వీడియో
దోసకాయ నీటితో ఆవిరి
దోసకాయ ముక్కలను మరుగుతున్న నీటిలో వేయాలి. నీరు బాగా మరిగిన తరువాత ఈ నీటిలో కొన్ని చుక్కల లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ వేయాలి. ఇందులో ఒక గ్రీన్ టీ బ్యాగ్ కూడా వేయచ్చు. దీని నుండి వచ్చే ఆవిరి పట్టడం వల్ల ముఖ చర్మం మెరుస్తుంది. నూనె, దుమ్ము, ధూళి కారణంగా మూసుకుపోయిన ముఖ చర్మ రంధ్రాలు క్లియర్ అవుతాయి.
నిమ్మకాయ
మరుగుతున్న నీటిలో కొద్దిగా నిమ్మరసం, గ్రీన్ టీ బ్యాగ్ లేదా టీ ఆకులు వేయాలి. నీటిని దించాక దీంట్లో కొన్ని చుక్కల పిప్పరమెంట్ ఎసెన్షియల్ ఆయిల్ వేయాలి. ఈ ఆవిరిని ముఖానికి పట్టడం వల్ల ముఖ చర్మం మెరుస్తుంది. చర్మం మీద ఉన్న మృత కణాలు, మురికి క్లీన్ అవుతాయి.
మాయిశ్చరైజర్‌గా బాదం నూనె
చలికాలం చర్మం పొడిబారడం సహజంగా జరుగుతుంటుంది కాబట్టి నూనె శాతం ఎక్కువ ఉన్న మాయిశ్చరైజర్లు వాడాలి.
∙బాదం నూనె, అలొవెరా జెల్ సమపాళ్లలో తీసుకొని అందులో కొద్దిగా వెనిలా ఎసెన్స్ కలపాలి. ఈ మిశ్రమాన్ని చలికాలం మాయిశ్చరైజర్‌గా ఉపయోగించవచ్చు.
స్నానానికి ముందు టీ స్పూన్ బాదం నూనె, అర టీ స్పూన్ తేనె కలిపి ముఖానికి, చేతులకు రాసి, మసాజ్ చేయాలి. పొడిబారే చర్మం మృదువుగా తయారవుతుంది.
టీ స్పూన్ బాదాం నూనెలో అర టీ స్పూన్ పంచదార కలిపి ముఖానికి రాసి మృదువుగా మర్దన చేయాలి. తర్వాత పెసరపిండిలో కొద్దిగా నీళ్లు కలిపి పేస్ట్ చేసి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి.
వారానికి రెండు సార్లు ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మం పొడిబారదు.
Comments
Please login to add a commentAdd a comment