సాక్షి, బెంగుళూరు: రానున్న దీపావళి, దసరా, క్రిస్‌మస్ పండుగులకు ప్రపంచ రీటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ సొంతమైన దేశీయ ఆన్‌లైన్ రిటైల్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ భారీ ప్రణాళికలే రచిస్తోంది. ఆఫర్లు, డిస్కౌంట్లతో వినియోగదారులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది. ప్రధానంగా పండుగ సీజన్‌లో బిగ్ బిలియన్ డేస్ సేల్స్‌లో దాదాపు రెట్టింపు విక్రయాలను సాధించాలని టార్గెట్‌గా పెట్టుకుంది. ఇందుకు సోషల్ మీడియా ప్లాట్‌ఫాంను కూడా బాగా వాడుకోనుంది. ఈ మేరకు ప్లిప్‌కార్ట్ ప్రతినిధులు తమ వ్యూహాలను వెల్లడించింది. భారతీయ వినియోగదారులకు అత్యంత విలువైన ఉత్పత్తులను అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని ఫ్లిప్‌కార్ట్ కార్పొరేట్ అధికారిక రజనీష్ కుమార్ తెలిపారు.
ఫ్లిప్‌కార్టు దసరా నుంచి క్రిస్‌మస్ వరకు వరుస ఆఫర్లతో హోరెత్తించనుంది. ముఖ్యంగా కంపెనీ ప్రధాన బ్రాండ్లు స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ విభాగాలలో నూతన ఒరవడి సృష్టించనుంది. సోషల్ మీడియాతో ప్రజలకు దగ్గరవ్వడంతో పాటు,సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వ్యాపారులు వినియోగదారుల సమన్వయంతోనే తమ లక్ష్యం నెరవేరుతుందన్నారు. అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన సేవలను అందించడంలో భాగంగా గిడ్డంగులు, సరఫరా వ్యవస్థను మెరుగుపరుస్తామన్నారు.
స్థానిక చట్టాలను గౌరవిస్తూనే మెరుగైన సేవలను అందిస్తామన్నారు. ఫ్లిప్‌కార్టు ఎగ్జిక్యూటివ్ స్పందిస్తూ 20శాతం నాణ్యమైన బ్రాండ్‌లతో 80శాతం అమ్మకాలను సాధించే విధంగా వ్యూహం రచిస్తున్నట్లు తెలిపారు. పండగ సీజన్‌లలో ప్రత్యేక ఉత్పత్తులను ప్రారంభిస్తామని తెలిపారు.. ప్రీ-ఆర్డర్‌లు, 50-70 శాతం వరకు ప్రత్యేక డిస్కౌంట్లను ప్రకటించనుంది. ఒక వస్తువు కొంటే మరొక వస్తువు ఉచితం లాంటి ఆఫర్లను ప్రవేశపెట్టనుంది. అత్యుత్తమ ప్రమాణాలతో వినియోగదారులను ఆకర్షించే విధంగా తమ ప్రణాళిక ఉంటుందని బ్రాండ్లకు పంపిన ఇమెయిల్‌లో ఫ్లిప్‌కార్టు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment