Flipkart Quick 90 Min Delivery: ఆర్డర్ చేసిన గంటన్నరలో ప్రొడక్ట్ డెలివరీ | Flipkart Quick Service - Sakshi
Sakshi News home page

Flipkart: ఆర్డర్ చేసిన గంటన్నరలో ప్రొడక్ట్ డెలివరీ

Published Wed, Apr 21 2021 6:56 PM | Last Updated on Thu, Apr 22 2021 12:53 PM

Flipkart Expands Quick Hyperlocal Service to Six New Cities - Sakshi

ఆన్‌లైన్‌లో ఏదైనా వస్తువు ఆర్డర్ చేస్తే డెలివరీ రావడానికి కనీసం ఒక్కరోజైనా పడుతుంది. కానీ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే అదే రోజు ఈ-కామర్స్ కంపెనీలు డెలివరీ చేస్తుంటాయి. కానీ, గంటన్నరలో డెలివరీ చేస్తామంటూ ఫ్లిప్‌కార్ట్ క్విక్ పేరుతో కొత్త సర్వీస్‌ని ప్రారంభించింది. ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న హైపర్ లోకల్, సూపర్ ఫాస్ట్ సర్వీస్ ఇది. ఈ సర్వీస్ పరిధిలోకి వచ్చే ప్రొడక్ట్స్‌ని ఆర్డర్ చేస్తే కేవలం 90 నిమిషాల్లో ఇంటికి వస్తాయి. గతంలోనే దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఈ సర్వీస్‌ను ప్రయోగాత్మకంగా ఫ్లిప్‌కార్ట్ పరీక్షించింది. 

ప్రస్తుతం ఢిల్లీ, గుర్గావ్, ఘజియాబాద్, నోయిడా, హైదరాబాద్, పూణే వంటి నగరాల్లో ఫ్లిప్‌కార్ట్ క్విక్ కింద సేవలు అందించనున్నట్లు ఒక పత్రికా ప్రకటన ద్వారా ప్రకటించింది. దేశంలో కోవిడ్-19 కేసులు పెరగడంతో, హైపర్‌ లోకల్ సర్వీస్ ద్వారా ప్రజలు తమ రోజువారీ అవసరాలను 90 నిమిషాల్లో పొందవచ్చు అని ప్రకటించింది. ఇతర మెట్రో నగరాలు కూడా ఈ సేవలో దశలవారీగా రానున్నట్లు పేర్కొంది. ఫ్లిప్‌కార్ట్ జూలై 2020లో ఫ్లిప్‌కార్ట్ క్విక్ బ్యాక్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో తాజా పండ్లు, కూరగాయలు, పాడి, మాంసం, కిరాణా, మొబైల్స్, ఎలక్ట్రానిక్స్ మరియు శిశువు సంరక్షణ ఉత్పత్తులు 90 నిమిషాల్లో డెలివరీ చేయనున్నారు. 

ఈ డెలవరి కింద 3వేలకు పైగా ఉత్పత్తులు ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ సేవలు బెంగళూరుకు మాత్రమే పరిమితం చేయబడ్డాయి. అయితే ఇప్పుడు ఆరు కొత్త నగరాలను కవర్ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. మొదటి ఆర్డర్‌పై డెలివరీ ఉచితం. ఆ తర్వాత రూ.499 కన్నా ఎక్కువ ఆర్డర్లపై ఫ్రీ డెలివరీ ఉంటుంది. ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఎప్పుడైనా ఆర్డర్స్ చేయొచ్చు. కస్టమర్లకు వీలైనంత త్వరగా ప్రొడక్ట్స్‌ని డెలివరీ చేసేందుకు ఫ్లిప్‌కార్ట్ షాడోఫ్యాక్స్ లాంటి లాజిస్టిక్స్ సంస్థలతో ఒప్పందం చేసుకుంది.

చదవండి: 

వాహనాల తయారీ నిలిపివేసిన హీరో మోటాకార్ప్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement