పై ఇంటర్నేషనల్ ధమాకా ఆఫర్లు | Pai International big offers in festival season | Sakshi
Sakshi News home page

పై ఇంటర్నేషనల్ ధమాకా ఆఫర్లు

Published Sat, Oct 1 2016 2:22 AM | Last Updated on Mon, Sep 4 2017 3:39 PM

పై ఇంటర్నేషనల్ ధమాకా ఆఫర్లు

పై ఇంటర్నేషనల్ ధమాకా ఆఫర్లు

హైదరాబాద్: దక్షిణ భారతదేశంలోని ప్రముఖ ఎలక్ట్రానిక్స్ రిటైల్ చైన్ ‘పై ఇంటర్నేషనల్’ తాజాగా వచ్చే పండగ సీజన్‌ను పురస్కరించుకొని వినియోగదారుల కోసం పలు వినూత్నమైన ఆఫర్లను ప్రకటించింది. ఇందులో భాగంగా కస్టమర్లకు రూ.13.5 కోట్ల విలువైన బహుమతులను అందిస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. వినియోగదారులు ఈ బహుమతులు పొందాలంటే పై ఇంటర్నేషనల్ ఔట్‌లెట్స్‌లో కనీసం రూ.2,000 పెట్టి షాపింగ్ చేయాలి.

వీరికి కంపెనీ ఒక లక్కీ డ్రా కూపన్‌ను అందిస్తుంది. ఇక చివరగా నిర్వహించే లక్కీడ్రాలో గెలుపొందిన వారు కార్లు వంటి పలు ఖరీదైన బహుమతులను సొంతం చేసుకోవచ్చు. కాగా వినియోగదారులకు ఈ సదుపాయం హైదరాబాద్, క ర్ణాటకలోని పై ఇంటర్నేషనల్, పై మొబైల్స్, పై డిజిటల్స్, పై ఫర్నీచర్ ఔట్‌లెట్స్‌లో అందుబాటులో ఉందని కంపెనీ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement