
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తన కస్టమర్ల కోసం ప్రైమ్ మెంబర్ షిప్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ప్రైమ్ మెంబర్ షిప్‌తో పలు సేవలను ఉచితంగా పొందవచ్చును. ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకున్న వారికి అమెజాన్ ప్రైమ్ వీడియో, ప్రైమ్ మ్యూజిక్, వేగవంతమైన డెలివరీ సేవలను అమెజాన్ అందిస్తోంది. ప్రైమ్ మెంబర్ షిప్ కోసం సంవత్సరానికి రూ.999 అమెజాన్ వసూలు చేస్తోంది.
మీరు అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్‌కు ఎలాంటి డబ్బులను చెల్లించకుండా సేవలను ఉచితంగా పొందవచ్చును. అది ఎలా అంటే.. మీరు కచ్చితంగా ఎయిర్‌టెల్ లేదా జియో ఫైబర్ కల్గిఉన్న వినియోగదారుడై ఉండాలి. ఎయిర్‌టెల్ తన కస్టమర్లకు పలు రీఛార్జ్‌లపై అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్‌ను నెల రోజులపాటు ఉచితంగా అందిస్తోంది. ఎయిర్‌టెల్ వినియోగదారులు రూ .349, రూ. 299 రిచార్జ్ చేస్తే 30 రోజులపాటు అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందవచ్చును.
ఎయిర్‌టెల్‌తో పాటుగా జియో ఫైబర్ కూడా ఉచిత అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ అందిస్తోంది. జియోఫైబర్‌కు సంబంధించిన 999,1499, 2499,3999,8499 ప్లాన్లతో రీచార్జ్ చేస్తే అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందవచ్చును.
Comments
Please login to add a commentAdd a comment