
ముంబై: డిజిటల్ చెల్లింపులు, ఆర్థిక సేవల సంస్థ పేటీఎం కస్టమర్లకు మరోసారి 4కా 100 క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ సందర్భంగా యూపీఐ నగదు బదిలీపై ఈ అద్భుతమైన ఆఫర్‌ను తిరిగి తీసుకొస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ ఆఫర్ జూన్ 19 వరకు ఉంటుంది.
మ్యాచ్ రోజుల్లో కొత్త కస్టమర్లు పేటీఎం యూపీఐ ఉపయోగించి నాలుగు రూపాయలు పంపితే రూ.100 క్యాష్ బ్యాక్ పొందవచ్చు. అలాగే ఇప్పటికే యాప్ కలిగిన కస్టమర్లు రిఫరల్ ప్రోగ్రామ్‌లో పాల్గొనడం ద్వారా రూ.100 వరకు క్యాష్ బ్యాక్ పొందగలరని కంపెనీ పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరి ఇండియా వర్సెస్ సిరీస్‌లో ఈ ఆఫర్‌ను తొలిసారి ప్రవేశపెట్టినపుడు లక్షల మంది కస్టమర్లు రూ.100 క్యాష్‌బ్యాక్‌ను గెలుచుకున్నారు.