సాక్షి, ముంబై: టెలికా ఆపరేటర్ ఐడియా గురువారం కొత్త క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ప్రటకించింది. ఇప్పటివరకూ డేటా వార్‌తో కస్టమర్లను ఆకట్టుకున్న టెలికాం సంస్థలు ఇపుడిక క్యాష్‌బ్యాక్‌లపై దృష్టిపెట్టినట్టు కనిపిస్తోంది. తాజాగా జియో, ఎయిర్‌టెల్ తరహాలో ఐడియా కూడా 4 జీ ఫోన్లు కొనుగోలు చేసిన వారికి 2,000 రూపాయల క్యాష్ బ్యాక్ అందించనుంది. ఫిబ్రవరి 23 శుక్రవారం ఈ పథకాన్ని అమలు చేయనున్నట్టు ఐడియా ప్రకటించింది.
4జీ హ్యాండ్సెట్స్ ద్వారా 4జీ నెట్‌వర్క్‌కి కస్టమర్ అప్ గ్రేడ్ చేయడమే తమ లక్ష్యమని ఐడియా సెల్యులార్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ శశి శంకర్ ఒక ప్రకటనలో తెలిపారు. తాజాగా ప్రకటించిన ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ ప్రీపెయిడ్ , పోస్ట్ పెయిడ్ యూజర్లకి వర్తిస్తంఉది. అయితే ప్ రీపెయిడ్ యూజర్లు ప్రతినెలా రూ.199 ప్లాన్ రీఛార్జ్ చేసుకోవలసి ఉంటుంది. ఇందులో రోజుకు 1.4 జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్ లోకల్ ఎస్‌టీడీ) పాటు, రోజుకి వంద ఎస్‌ఎంస్‌లు ఉచితం. ఈ 199 రూపాయల రీచార్జ్ మొదటి 18 నెలల కాలంలో మూడువేల రూపాయల విలువైన రీఛార్జ్‌లు చేసుకుంటే మొదటి దఫాగా రూ. 750 క్యాష్‌బ్యాక్ అందిస్తుంది. మరో 18 నెలల రీచార్జ్ అనంతరం మరో 1,250 రూపాయల క్యాష్ బ్యాక్ కస్టమర్లకు అందిస్తుంది.
పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకు, అన్ని నిర్వాణ వాయిస్ కాంబో పధకాలకు ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్ వర్తిస్తుంది. 36 నెలల వ్యవధిలో రూ. 389 రీచార్జ్ ప్లాన్‌తో మొదలయ్యే ప్లాన్లపై ఆఫర్ ఏప్రిల్ 30, 2018 వరకు అందుబాటులో ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment