వార్‌ కంటిన్యూ: ఎయిర్‌టెల్‌ 100 శాతం క్యాష్‌బ్యాక్‌ | Airtel offering 100 per cent cashback on Rs 349 recharge | Sakshi
Sakshi News home page

వార్‌ కంటిన్యూ: ఎయిర్‌టెల్‌ 100 శాతం క్యాష్‌బ్యాక్‌

Published Fri, Oct 27 2017 9:53 AM | Last Updated on Fri, Oct 27 2017 9:53 AM

Airtel offering 100 per cent cashback on Rs 349 recharge

టెలికాం మార్కెట్‌లో టారిఫ్‌ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. జియోకు ఫెస్టివల్‌ సీజన్‌లో రూ.399 ప్లాన్‌పై ప్రకటించిన 100 శాతం క్యాష్‌బ్యాక్‌ మాదిరి, టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌ కూడా అచ్చం అదే ఆఫర్‌ను తీసుకొచ్చింది. తన ప్రీపెయిడ్‌ యూజర్లకు ఎయిర్‌టెల్‌ రూ.349 ప్లాన్‌పై 100 శాతం క్యాష్‌బ్యాక్‌ను అందించనున్నట్టు తెలిపింది. ఇది కూడా పరిమిత కాల వ్యవధిలోనే ఆఫర్‌ చేస్తోంది. ఇది కేవలం పరిమిత కాల ఆఫర్‌ అని, ఎప్పుడైనా ఇది ముగియవచ్చని కంపెనీ పేర్కొంది. కానీ ఈ ఆఫర్‌ తుది గడువు ఎప్పుడో వెల్లడించలేదు.

కంపెనీ డైరెక్ట్‌గా కాక, వాయిదాల పద్ధతిలో ఈ క్యాష్‌బ్యాక్‌ మొత్తాన్ని అందిస్తోంది. ఎయిర్‌టెల్‌ కస్టమర్లు తొలుత రూ.349తో రీఛార్జ్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. తరువాత 7 వాయిదాల్లో మొత్తం రీఫండ్‌ చేస్తోంది. అంటే రూ.349ను ఏడు నెలల్లో వెనక్కి ఇచ్చేస్తుందన్నమాట. ఈ ఆఫర్‌ అందుబాటులో ఉన్నవారు ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంకు, మై ఎయిర్‌టెల్‌ యాప్‌ ద్వారా రీఛార్జ్‌ చేయించుకోవాల్సి ఉంటుంది.  రూ.349 ప్లాన్‌ కింద ఎయిర్‌టెల్‌ 28జీబీ డేటాను 28 రోజుల పాటు అందిస్తోంది. అంతేకాక ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్‌ కాల్స్‌ను చేసుకోవచ్చు. రోజుకు 1జీబీ డేటాను వాడుకోవచ్చు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement