బీఎస్‌ఎన్‌ఎల్‌ దసరా ఆఫర్‌ | BSNL to Give 50 Percent Cashback on Talk Time Vouchers With 'Dussehra Vijay' Offer  | Sakshi
Sakshi News home page

బీఎస్‌ఎన్‌ఎల్‌ దసరా ఆఫర్‌

Published Sat, Sep 23 2017 10:40 AM | Last Updated on Sat, Sep 23 2017 1:30 PM

బీఎస్‌ఎన్‌ఎల్‌ దసరా ఆఫర్‌

బీఎస్‌ఎన్‌ఎల్‌ దసరా ఆఫర్‌

సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ బీఎస్‌ఎన్‌ఎల్‌ దసరా కానుకగా బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. వాయిస్‌ రీఛార్జ్‌లపై 50 శాతం క్యాష్‌బ్యాక్‌ అందించనున్నట్టు తెలిపింది. దసరా విజయ్‌ ఆఫర్‌ కింద ఈ క్యాష్‌బ్యాక్‌ స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్త ప్రమోషనల్‌ ఆఫర్‌తో పాటు ఈ క్యాష్‌బ్యాక్‌ను కంపెనీ ఆఫర్‌ చేయనుంది. అంతేకాక తన మొబైల్‌ యాప్‌ లేదా వెబ్‌సైట్‌ ద్వారా రీఛార్జ్‌లు చేపించుకుంటే ఫుల్‌ టాక్‌ టైమ్‌ ఆఫర్లను పరిమిత కాల వ్యవధిలో అందించనున్నట్టు కూడా తెలిపింది. ఈ రెండు ఆఫర్లు దేశవ్యాప్తంగా ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్‌ కస్టమర్లందరికీ అందుబాటులో ఉండనున్నాయి. సెప్టెంబర్‌25 నుంచి ఇవి లైవ్‌గా అందించనున్నారు.  

బీఎస్‌ఎన్‌ఎల్‌ తాజా ఆఫర్‌ కింద, సెప్టెంబర్‌ 25 నుంచి అక్టోబర్‌ 25 మధ్య రీఛార్జ్‌ ప్యాక్‌లను కొనుగోలు చేసే కస్టమర్లు, రీఛార్జ్‌ విలువలపై 50 శాతం క్యాష్‌బ్యాక్‌ పొందనున్నారు. రూ.42, రూ.44, రూ.65, రూ.69, రూ.88, రూ.122 టాక్‌ టైమ్‌ రీఛార్జ్‌లకు ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రకటించింది. ఫుల్‌ టాక్‌ టైమ్‌ ఆఫర్‌ కేవలం రూ.30 రీఛార్జ్‌పైనే ఉండనుంది. ఈ ఆఫర్‌ సెప్టెంబర్‌ 25 నుంచి ప్రారంభమై, అక్టోబర్‌ 2తో ముగియనుంది. 

పండుగ సీజన్‌లో అదనపు ప్రయోజనాలతో తాము మీ ముందుకు వస్తున్నట్టు బీఎస్‌ఎన్‌ఎల్‌ బోర్డు డైరెక్టర్‌ ఆర్‌కే మిట్టల్‌ చెప్పారు. తమ ప్రీపెయిడ్‌ మొబైల్‌ కస్టమర్లకు చాలా ఎఫ్‌టీటీ ఆఫర్లు అందుబాటులో ఉండనున్నట్టు కూడా పేర్కొన్నారు. ఈ నెల మొదట్లో లాంచ్‌ చేసిన ప్రమోషనల్‌ ఆఫర్‌ కింద ఆన్‌-నెట్‌ కాల్స్‌ టారిఫ్‌ను నిమిషానికి 15 పైసలకు తగ్గించింది. ఆఫ్‌-నెట్‌ కాల్స్‌ను నిమిషానికి 35పైసలకు కుదించింది. 8 రూపాయల రీఛార్జ్‌ ప్యాక్‌పై 30 రోజుల వరకు ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది. ప్యాన్‌ ఇండియా బేసిస్‌లో 4జీ వాయిస్‌ఓవర్‌ ఎల్టీఈ సర్వీసులను లాంచ్‌ చేసేందుకు కూడా బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్లాన్‌ చేస్తోంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement