
దేశీయ బడ్జెట్ ఎయిర్‌లైన్ సంస్థ ఇండిగో బంపర్ ఆఫర్ ప్రకటించింది. సిటీ బ్యాంకు క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను వాడుతూ ఎవరైతే విమాన టిక్కెట్లను బుక్ చేసుకుంటారో వారికి రూ.1500 క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఇవ్వనున్నట్టు తెలిపింది. ఈ విషయాన్ని ఇండిగో మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్ ద్వారా వెల్లడించింది. 2018 ఏప్రిల్ 18 నుంచి 2018 ఏప్రిల్ 21 మధ్యలో టిక్కెట్లను బుక్ చేసుకునే వారు ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవచ్చని పేర్కొంది. అయితే ఈ ఆఫర్ పొందాలంటే కనీస లావాదేవీ రూ.7500 ఉండాలి. అంతేకాక ఇండిగో యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకునే వారు మాత్రమే ఈ ఆఫర్‌ను పొందవచ్చని ఎయిర్‌లైన్స్ తెలిపింది.
అయితే కార్డుల ద్వారా నిర్వహించే మొట్టమొదటి చెల్లుబాటు లావాదేవీ మాత్రమే ఈ ఆఫర్ కింద ప్రయోజనాలకు అర్హత సాధిస్తుంది. టిక్కెట్ బుక్ చేసిన 90 రోజుల్లో కస్టమర్ల కార్డుకు ఈ క్యాష్ బ్యాక్ అందుతుంది. ఈ ఆఫర్‌ను, క్యాష్‌బ్యాక్‌ను ట్రాన్సఫర్ చేయడానికి, ఎక్స్చేంజ్ చేయడానికి కుదరదని ఇండిగో పేర్కొంది. ఈ ఆఫర్‌లో పాల్గొనే కస్టమర్లు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఏమన్నా దెబ్బతింటే ఇండిగో బాధ్యత వహించదని కూడా తెలిపింది. ఈ ఆఫర్‌ను మరే ఇతర ఆఫర్ లేదా ప్రమోషన్‌కు కలుపబోమని ఇండిగో వెల్లడించింది. ముందస్తు ప్రకటన లేకుండానే ఆ ఆఫర్‌ను ఇండిగో, సిటీ బ్యాంకు ఏ సమయంలోనైనా సవరించడం లేదా ఆపివేయడం జరుగవచ్చని, ఈ ఆఫర్‌పై ఉన్న అన్ని ఫిర్యాదులను, సమస్యలను సిటీ బ్యాంకుతో సంప్రదించి పరిష్కరించుకోవాలని, ఇండిగో దీనికి బాధ్యత వహించదని కూడా చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment