
సాక్షి, న్యూఢిల్లీ: ఇండిగో విమానయాన సంస్థ న్యూ ఇయర్ విక్రయాలను ప్రకటించింది. నేటి(సోమవారం)నుంచి మూడు రోజులు పాటు ఈ సేల్ నిర్వహించనుంది. ఈ న్యూ ఇయర్ సేల్‌లో విమాన టికెట్ల ప్రారంభ ధర రూ. 899 గా ఉంటుందని ఇండిగో ప్రకటించింది. దీంతోపాటు హెచ్‌డీఎఫ్‌సీబ్యాంక్ క్రెడిట్ కార్డులతో చేసిన చెల్లింపులపై10శాతం దాకా క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. తద్వారా సుమారు రూ.600 వరకు అదనపు ప్రయోజనం అలాగే మరో రూ. 600 వరకువరకు అదనంగా రూ. 600 వరకు ఇండిగో స్పెషల్ సర్వీస్ వోచర్లు కూడా అందుబాటులోఉంటాయని తెలిపింది.అలాగే ఇలా బుక్ చేసుకున్న టికెట్లు ఫిబ్రవరి 1 నుంచి ఏప్రిల్ 15 మధ్య ప్రయాణాలకు చెల్లుబాటులో ఉంటాయి.
ఇండిగో అధికారిక వెబ్ సైట్ www.goindigo.in, సంస్థ యాప్‌తోపాటు ఇతర బుకింగ్ వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంటాయి.
నిబంధనలు-షరతులు: -
ఈ ప్రయాణ కాల వ్యవధిలో రూ .899 నుంచి ధరలు ప్రారంభమవుతాయి. ఈ ఆఫర్ లో బుక్ చేసుకున్న టికెట్లను కాన్సిల్ చేసుకుంటే కేవలం చట్టపరమైన పన్నులు తిరిగి ఇవ్వబడతాయి.గ్రూప్ బుకింగులకు ఈ ఆఫర్ వర్తించదు. ఎంపిక చేసిన విమానాల్లో పరిమిత సీట్లకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. పరిమితి ముగిసిన తరువాత రెగ్యులర్ ఛార్జీలు వర్తిస్తాయి. దీనికి సంబందించిన పూర్తి వివరాలు ఇండిగో వెబ్‌సైట్‌లో లభ్యం.