
సాక్షి,న్యూఢిల్లీ: గత ఏడాది గ్రాసరీస్ (కిరాణా,ఆహారోత్పత్తులుఇతరత్రా) వ్యాపారంలోకి అడుగుపెట్టిన ప్రముఖ ఆన్‌లైన్ రీటైల్ దిగ్గజం అమెజాన్ ఈ మార్కెట్‌ను కొల్లగొట్టేందుకు మరింత దూకుడును ప్రదర్శిస్తోంది. వినియోగదారులను ఆకట్టుకునేందుకు సూపర్ వాల్యూ డే ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్‌లో నెలవారీ సరుకుల కొనుగోళ్లపై క్యాష్‌బ్యాక్‌లు, డిస్కౌంట్లను వినియోగదారులకు అందిస్తోంది. శుక్రవారం ప్రారంభమైన ఈ సేల్ మార్చి 7వ తేదీవరకు కొనసాగుతుంది.
ఎస్‌బీఐ లేదా ఐసీఐసీ కార్డులు, అమెజాన్ పే, అమెజాన్ డిజిటల్‌వాలెట్ ద్వారా జరిపే కొనుగోళ్లపై ఈ ఆఫర్లను అందిస్తుంది. ఎస్‌బీఐ కార్డుపై దాదాపు 600 రూపాయల దాకా డిస్కౌంట్ లభిస్తుంది. ఎస్‌బీఐ కస్టమర్లకు ఈ అవకాశం మార్చి 4-7 తేదీల మధ్య అందుబాటులో ఉంది.
మార్చి 1-3వ తేదీల మధ్య ఐసీఐసీఐ కార్డు కొనుగోళ్లపై ఆఫర్స్‌ను అందుకోవచ్చు. రూ. 1500 కొనుగోళ్ళపై ఐసీఐసీఐ కస్టమర్లు 15శాతం దాకా క్యాష్‌బ్యాక్ లేదా 600దాకా డిస్కౌంట్‌ను పొందవచ్చు. అలాగే ప్రతీనెల ఒకటవ తేదీనుంచి 7వ తేదీవరకు 40శాతం తగ్గింపు లేదా, 15శాతం క్యాష్ బ్యాక్ అందివ్వనున్నట్టు వెబ్‌సైట్‌లో వెల్లడించింది. మరిన్ని వివరాలు అమెజాన్ వెబ్‌సైట్‌లో లభ‍్యం.
Comments
Please login to add a commentAdd a comment